Indian Railways: భారత దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేనే. దేశవాప్యతంగా నిత్యం వందలాది రైళ్లు లక్షల మందినిక గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయినా.. ఇంకా చాలా మంది ప్రయాణికులు టికెట్ దొరకక, భోగీల్లో స్థలం లేక రైలు ప్రయాణం వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడడంతోపాటు రైల్వే ఆదాయం కోల్పోతోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్న రైల్వే.. కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. రైతు మార్గాలను విస్తరిస్తోంది. రైలు ఆలస్యమైతే రిఫండ్ చేయడం, భోజనం వంటి సదుపాయలు కల్పిస్తోంది. తాజాగా ప్రయాణికుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైళ్లలో జనరల్ బోగీలు దశలవారీగా పెంచాలని నిర్ణయించింది. దీంతో రిజర్వేషన్ లేనివారు కూడా వీటిలో ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది.
ప్రతీ రైలులో 4 బోగీలు..
రాబోయే రోజుల్లో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కూడా ప్రస్తుతం ఉన్న రెండు జనరల్ బోగీలను నాలుగుకు పెంచాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఆధునిక పరిజ్ఞానం క లిగి ఉన్న ఎలాచ్‌బీ కోచ్‌లు ఉంటాయని ప్రకటించింది. జోన్ పరిధిలో 21 జతల రైళ్లకు అదనంగా 80 బోగీలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
కొత్త రూపం.. అధిక సీట్లు
రైళ్లలో పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా జనరల్ బోగీల్లోనే ప్రయాణిస్తారు. ఇన్నాళ్లూ పాతకాలం సాధారణ బోగీలే ఉన్నాయి. అవీ రెండే. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈనేపథ్యంలో జనరల్ బోగీలు పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. కొత్తగా వస్తున్న జనరల్‌బ ఓగీలను ఎలాచ్‌బీ టెన్నాలజీతో తయారు చేస్తున్నారు. పాత తరం ఐసీఎఫ్ బోగీల్లో 90 సీట్లు ఉంటే.. ఎలాచ్‌బీ బోగీల్లో 100 సీట్లు ఉంటాయి. ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే జోన్ పరిధిలో 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 66 ఎలాచ్‌బీ కోచ్‌లు ప్రవేశపెట్టారు. గౌతమి, దక్షిణ్, నారాయణాద్రి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు చేశారు. దుశవ్యాప్తంగా 370 రైళ్లలో ఈ అదనపు బోగీలు ప్రవేశపడతారు. దీంతో 70 వేల మంది అదనంగా ప్రయాణింఏ అవకాశం కలుగుతుంది.