Good News For Ration Card Holders: పంటలెక్కువైనా ఈ పథకాలెందుకు.. ప్రతి ఇంట్లో సంతాన పరిమితి లేనందుకు అని పౌరసరఫరాల శాఖ ప్రజలకు బియ్యం అందజేస్తోంది. రాష్ట్రంలోనే వరి పండుతున్నా బియ్యం పంపిణీ చేసేందుకు సంకల్పించింది. 1986లో వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో రెండు రూపాయలకు కిలో బియ్యం అందింేందుకు నిర్ణయించింది. దీంతో అప్పటి నుంచి బియ్యం నిరంతరంగా అందజేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ.1కే కిలో బియ్యం ఇస్తోంది. కరోనా సమయం నుంచి అవి కూడా తీసుకోకుండా ఉచితంగానే సరఫరా చేయడం గమనార్హం.

కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందజేస్తోంది. గత రెండు నెలలుగా కేంద్రం బియ్యం ఇవ్వాలని సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ రెండు నెలల బియ్యం కలిపి ప్రస్తుతం 15 కిలోల బియ్యం అందజేసేందుకు నిర్ణయించింది. దీంతో ఈ నెల ఒక్కో వ్యక్తికి 15 కిలోల బియ్యం అందించాలని ఆదేశాల జారీ చేసింది. దీంతో ఈ నెల బియ్యం ఐదు కిలోల బదులు పదిహేను కిలోల బియ్యం ఇవ్వనుంది. దీంతో ఒక్కో కుటుంబానికి దాదాపు 60 కిలోల బియ్యం అందనున్నట్లు తెలుస్తోంది.
పేదలకు బియ్యం ఇచ్చే పథకంలో భాగంగానే ఈనెల 15 కిలోల బియ్యం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మోకాలడ్డిందో తెలియడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణాలేంటనే దానిపై నేతల్లో అనుమానం నెలకొంది. దీంతో ఇప్పుడు ఇచ్చే బియ్యంతో ఒక్కొక్కరికి పదిహేను కిలోలు కావడంతో ఏప్రిల్, మే నెలల్లో ఇవ్వాల్సిన ఐదు కిలోల చొప్పున బియ్యం ప్రస్తుతం అందజేయనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అందించే ఐదు కిలోల బియ్యంతో మొత్తం పదిహేను కిలోలు రానున్నాయి. ఈనెల 4 నుంచి 19 వ తేదీ వరకు ఈ బియ్యం మొత్తం ప్రజలకు అందించనున్నారు. ఒకేసారి ఇంత మొత్తంలో బియ్యం అందించడంతో ప్రజలు కూడా వాటిని తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనికి ప్రజలను బాధ్యులను చేస్తున్నారు. ప్రస్తుతం పదిహేను కిలోల బియ్యం వస్తుండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వాలు చేసే పనుల వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.