Modi Was Shocked: దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలతో పాటు పెట్రో భారం కూడా ప్రజలను కుంగదీస్తోంది. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ నిట్టూరుస్తున్నారు. జీఎస్టీ వస్తే పేదల బతుకుల్లో వెలుగులు నిండుతాయని చెప్పినా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. పేదల బతుకులు మారతాయని అనుకున్నా ఆ చాయలు కనిపించడం లేదు. దీంతో ఏ ప్రభుత్వం వచ్చినా మా తలరాత ఇంతేనని సరిపెట్టుకుంటున్నారు. అన్ని ధరలు పెరుగుతున్నా సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. ఈ క్రమంలో రోజువారి ఖర్చులు అంచనాలు మించుతున్నాయి.
దీనిపై ఒకటో తరగతి చదువుతున్న బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే లేఖ రాసింది. పెరుగుతున్న ధరలతో ప్రజలు పడుతున్న అవస్థల మీద తన ఆవేదన వ్యక్తం చేసింది. మోడీజీ మీరు ధరలు పెంచడంతోనే మా బతుకులు ఇలా మారాయని చెబుతోంది. మీరు ధరలు పెంచడంతో నాకు కూడా ఇబ్బందులు తలెత్తాయని వాపోయింది. తన వస్తువులైన పెన్సిల్, పెన్ను రబ్బర్ లకు కూడా ధరలు పెరగడంతో సమస్యలొస్తున్నాయని పేర్కొంది. తన పెన్సిల్, రబ్బర్ ను దొంగలించడంతో మా అమ్మ నన్ను కొట్టిందని చెప్పింది.

ధరలు ఇలా పెరిగితే బతుకులు ఎలా అని ప్రశ్నించింది. భవిష్యత్ లో ప్రజలకు మరిన్ని తిప్పలు తప్పవని చెబుతోంది. మీరు ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచితే భారం ప్రజల మీదే కదా అని వివరించింది. దీంతో బాలిక చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ బాలిక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కనౌజీ జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది. సాక్షాత్తు ప్రధానినే ప్రశ్నించిన ఆమె మాటలకు మురిసిపోతున్నారు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద మాటలా అని ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ధరల పెరుగుదల అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేస్తోంది. దీంతో బాలిక అడిగిన ప్రశ్నలు సరైనవే. ప్రభుత్వాలు ఏదో చేస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. దీంతోనే సామాన్యుడిపై పెను భారం పడుతోంది. భవిష్యత్ లో ధరలు ఇంకా పెరిగితే ఆ భారం కూడా మనమే మోయాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వాలు ధరల పెరుగుదలపై దృష్టి సారించి మధ్యతరగతి ప్రజల బతుకుల్లో వెలుగులు నిండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.