Extra Marital Affairs: మన వివాహ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. అన్యోన్యంగా కాపురం చేసుకోవాల్సిన జంటలు పక్కదారి తొక్కుతున్నారు. ఫలితంగా నూరేళ్లు హాయిగా సంసారం చేసుకోవాల్సిన వారే అడ్డదారులు తొక్కడంతో పచ్చని కాపురాల్లో చిచ్చు రేగుతోంది. జీవిత భాగస్వామి చేసిన పనికి తల ఎత్తుకోలేక మధ్యలోనే వారు తనువు చాలిస్తున్నారు. కడదాకా తోడుంటారని భావించిన భాగస్వామి మధ్యలోనే మోసాలకు పాల్పడటంతో ఆత్మహత్యలు చేసుకోవడం మామూలే. దీంతో పచ్చని జీవితాల్లో చిచ్చు రేపేది అక్రమ సంబంధాలే. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలు మానవ జీవితాలకే మచ్చగా మిగులుతున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ వివాహిత చేసిన పనికి ఆమె భర్త తట్టుకోలేకపోయాడు. నూరేళ్లు తోడుంటానని చేసిన బాసలు మరిచి పరాయి మగాడికి మరిగింది. దీంతో తన సుఖం కోసం మొగుడినే పక్కకు పెట్టింది. దీంతో ఇది పద్దతి కాదని చాలా సార్లు భర్త చెప్పినా పెడచెవిన పెట్టింది. చివరకు ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీన్ని తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకున్న భార్య హ్యాండివ్వడంతో కలత చెందిన అతడు విరక్తితో ఓ సెల్ఫీ కూడా తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
సెల్ఫీలో తన భార్య చేసిన మోసం గురించి కన్నీరు కార్చాడు. తనపై మోజు తీరడంతో పరాయి మగాడికి అలవాటై తన పరువు తీసిందని ఏడ్చాడు. ఇలాంటి భార్యకు మొగుడినైందుకు సిగ్గుపడుతున్నానని వాపోయాడు. జీవితంలో ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని వేడుకున్నాడు. ఆలి చేసిన మోసానికి అవమానంగా ఫీలయ్యాడు. పోలీసులకు చెప్పినా వారు కూడా పట్టించుకోవడం లేదు. దీంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్యను కఠినంగా శిక్షించాలని కోరాడు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే నెపంతో జీవిత భాగస్వామిని కడతేర్చుతున్న తతంగాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పరాయి వారి సుఖం కోసం కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారు. క్షణిక సుఖం కోసం సంసారాలను కాదనుకుంటున్నారు. కట్టుకున్న వారిని కష్టాలు పడేలా చేస్తున్నారు. జీవితాలను మధ్యలోనే చిదిమేస్తున్నారు. దీంతో వారి స్వార్థంతో భర్త, పిల్లలను విడిచిపెట్టి తన సుఖం తాను చూసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.