https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు

కరోనాతో కష్టకాలంలో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా అనంతరం పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్నా అనుకున్న స్థాయిలో బడ్జెట్‌ చేకూరడం లేదు. ఇంత కాలం కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతుండడంతో ఆయా రాష్ట్రాలు పాత ప్రతిపాదనలు ఓపెన్‌ చేస్తున్నాయి. Also Read: ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా? ఇందులో భాగంగా.. ఏపీ, తెలంగాణలకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 11:39 AM IST
    Follow us on

    కరోనాతో కష్టకాలంలో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా అనంతరం పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్నా అనుకున్న స్థాయిలో బడ్జెట్‌ చేకూరడం లేదు. ఇంత కాలం కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతుండడంతో ఆయా రాష్ట్రాలు పాత ప్రతిపాదనలు ఓపెన్‌ చేస్తున్నాయి.

    Also Read: ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా?

    ఇందులో భాగంగా.. ఏపీ, తెలంగాణలకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్‌ శివారులో ఉన్న జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్రశ్రేణి సంస్థలైన లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్‌ ఇండియా రెడీ అయ్యాయి. ఈ రెండూ కలిపి 700 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. ఈ మేరకు ఈ కంపెనీల ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

    రూ.400 కోట్లతో గ్రాన్యూల్స్ ఇండియా మాన్‌ఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతుండగా, రూ.300 కోట్లతో ఇదే రంగంలో లారస్ ల్యాబ్స్ పరిశ్రమను నెలకొల్పుతోంది. ఈ రెండు కంపెనీల ద్వారా కొత్తగా రాష్ట్రంలో 1,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అటు ఏపీలోనూ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్‌ గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్‌ గోల్ఫ్‌ కార్టులతోపాటు బ్యాటరీ స్వాపింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం రూ.1,750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.

    Also Read: బీజేపీకి టార్గెట్‌ అయిన హరీష్‌ రావు?

    దేశంలో లంబోర్గిని బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్‌ గ్రీన్‌ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు, చార్జింగ్‌ స్వాపింగ్, ఆర్‌అండ్‌డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్‌ గ్రీన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఆ పెట్టుబడి ఏపీలో పెట్టబోతున్నారు. ప్రతిపాదనలు రాగా.. కార్యాచరణ సిద్ధమవుతోంది.