https://oktelugu.com/

ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా?

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? ఇప్పటికైతే ఈ స్థానంలో కాంగ్రెస్ ఉంది. మరి భవిష్యత్తులోనూ ఉంటుందా? బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఇప్పుడు హోరాహోరీ టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. మరి ప్రజల అభీష్టం ఎలా ఉంది. దుబ్బాకలో గెలుపుతో టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ నిలుస్తుందా? కాంగ్రెస్ ను పక్కనపెట్టి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందా? ఇలాంటి ఆసక్తికర పరిణామాలకు ‘దుబ్బాక ’ ఎన్నికలు వేదికగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 11:49 AM IST
    Follow us on


    తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? ఇప్పటికైతే ఈ స్థానంలో కాంగ్రెస్ ఉంది. మరి భవిష్యత్తులోనూ ఉంటుందా? బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఇప్పుడు హోరాహోరీ టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. మరి ప్రజల అభీష్టం ఎలా ఉంది. దుబ్బాకలో గెలుపుతో టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ నిలుస్తుందా? కాంగ్రెస్ ను పక్కనపెట్టి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందా? ఇలాంటి ఆసక్తికర పరిణామాలకు ‘దుబ్బాక ’ ఎన్నికలు వేదికగా మారాయి. మరి ప్రజల తీర్పుతో బీజేపీ, కాంగ్రెస్ స్థానాలు మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయంలో దుబ్బాక ఎన్నికలు కొత్త మార్గనిర్ధేశం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
    దుబ్బాక పోరు రసవత్తరంగా సాగుతోంది.  పార్టీలు ఒకదానికి మించి మరొకటి దూకుడు పెంచాయి..  వ్యూహా ప్రతివ్యూహాలతో రణరంగాన్ని తలపిస్తోంది.  ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే రెండో స్థానం కోసమే పోరు జరుగుతుందా…తెలంగాణలో ప్రతిపక్షం ఎవరో తేల్చుకోవడానికే దుబ్బాక పొలిటికల్ డ్రామా నడుస్తోందా.. అని రాజకీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: బీజేపీకి టార్గెట్‌ అయిన హరీష్‌ రావు?

    దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎట్టిపరిస్థితిల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ కు ఎవరు పోటీ ఇస్తారనే దానిపైనే ప్రధానంగా  తీవ్ర చర్చలు నడుస్తున్నాయి.   టీఆర్ ఎస్ ను ఎదుర్కొనేది కాంగ్రెస్సా… బీజేపీ యా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి వేరే ఏ లీడర్ పోటీ చేసినా.. కాంగ్రెస్ గురించి పెద్దగా చర్చించుకునే వారు కాదు.. కానీ చెరుకు ముత్యంరెడ్డి  కుమారుడు .. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి పోటీకి సై అంటుండడంతో ప్రధాన పార్టీల మధ్య  టఫ్ ఫైట్ నడుస్తోంది.

    చెరుకు ముత్యంరెడ్డికి  ఉన్న మంచిపేరు, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావించింది.  ముఖ్య నేతలందరూ దుబ్బాకలోనే మకాం వేశారు. ఒక్కో మండలం బాధ్యత ఒక్కొ పెద్ద లీడర్ తీసుకుని ఆహర్నిషలు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ రేసులో లేదని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్  బీజేపీని టార్గెట్ చేయడం.. రూ.16లక్షలు పట్టుకోవడం. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ప్రత్యర్థి బీజేపీనే అన్నట్లు ప్రచారం ఊపందుకుంది.  బండి సంజయ్ అరెస్టు.. రాష్ట్రమంతటా ఆ పార్టీ శ్రేణుల నిరసనలు హోరెత్తాయి.  రెండు రోజుల రాజకీయాల్లో అంతటా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సీన్ మారిపోయింది. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా హోరెత్తిపోయాయి.  దుబ్బాక క్షేత్రం నుంచి కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టివేయడానికి, చివరి క్షణంలో కాంగ్రెస్ కు జెల్ల కొట్టడానికే ప్రస్తుత పరిణామాలు సాగాయని పలువురు అనుమానిస్తున్నారు.

    త్రిముఖ పోరులో  ఓటర్ల మద్దతు రాబట్టుకునేందుకు కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీలో హరీశ్ రావు అంతా తానై వ్యవహరిస్తూ ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.  సింగిల్ హ్యాండ్ గణేశ్ లాగా సవాల్ విసిరి ప్రత్యర్థులను  సెల్ఫ్ డిఫెన్స్ లో పడేస్తున్నారు.  బీజేపీ నేతలు అధికార పార్టీ అవినీతి, నిరుద్యోగ సమస్య, అభివృద్ధి రహిత పాలన..  ముఖ్యంగా దృష్టి సారించారు.  టీఆర్ఎస్ కు అల్టర్ నేట్ బీజేపీయే అంటూ విమర్శల దాడి పెంచారు.  సిద్దిపేట ఘటన తర్వాత టీఆర్ఎస్ ను తామే సమర్థంగా ఎదుర్కొంటామనే భావన కల్పించేశారు.

    Also Read: కమలం గూటికి విజయశాంతి? సీక్రెట్ చర్చలు?

    ఇలాంటి తరుణాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. బీజేపీ, టీఆర్ఎస్ కావాలనే రాజకీయాలు చేస్తున్నాయని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  అయితే అంతకుమించి కౌంటర్ ఇవ్వాల్సి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. లేకపోతే కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. దుబ్బాకలో గెలవాలని కాకుండా.. టీఆర్ఎస్ కు ఎవరూ పోటీ ఇస్తారో అనే దానిపైనే ప్రస్తుత ఎన్నికలు  నడుస్తున్నాయి. దీంతో దుబ్బాక పోరులో ఎవరు రెండో స్థానంలో ఉంటారో.. వారే భవిష్యత్ లో టీఆర్ఎస్ తో ప్రధానంగా పోటీపడే అవకాశం ఉందని తెలుస్తోంది.