Golden Globe Award Pawan : ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నామినేట్ కాగా… అవార్డు గెలుపొందింది. లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి ఆర్ ఆర్ ఆర్ టీం హాజరయ్యారు. ఆర్ ఆర్ ఆర్ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో నామినేట్ అయ్యింది. నామినేషన్స్ లో ఉన్న మిగతా సాంగ్స్ ని వెనక్కి నెట్టి నాటు నాటు అవార్డు దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు ని ఎంపిక చేశారు. ఒక మాస్ సాంగ్ ఈ గౌరవం అందుకోవడం అరుదైన విషయం.

ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు నాటు…’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామం అని పవన్ కళ్యాన్ అన్నారు.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన ఎం.ఎం.కీరవాణి గారికి అభినందనలు తెలిపారు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుంది. ‘నాటు నాటు’ గీతాన్ని రచించిన చంద్రబోస్, ఆలపించిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు రాజమౌళి, చిత్ర కథానాయకులు రాంచరణ్, ఎన్టీఆర్, నిర్మాత డి.వి.వి.దానయ్య అభినందనీయులు తెలిపారు పవన్ .
2009లో ఏ ఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఈ లిస్ట్ లో కీరవాణి చేరారు. వేదికపైకి వెళ్లి కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని అందుకున్నారు. కీరవాణి ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. మూడు దశాబ్దాలకు పైగా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఆయనతో పాటు పరిశ్రమకు వచ్చిన ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ కనుమరుగయ్యారు. కీరవాణి మాత్రం ఎప్పటికప్పుడు జనరేషన్స్ కి తగ్గట్లు తన మ్యూజిక్ లో మార్పులు తెస్తూ రాణిస్తున్నారు
2009లో ఏ ఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఈ లిస్ట్ లో కీరవాణి చేరారు. వేదికపైకి వెళ్లి కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని అందుకున్నారు. కీరవాణి ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. మూడు దశాబ్దాలకు పైగా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఆయనతో పాటు పరిశ్రమకు వచ్చిన ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ కనుమరుగయ్యారు. కీరవాణి మాత్రం ఎప్పటికప్పుడు జనరేషన్స్ కి తగ్గట్లు తన మ్యూజిక్ లో మార్పులు తెస్తూ రాణిస్తున్నారు.