Gold Price Today : బంగారం కొనాలని అనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే రెండు రోజులగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే మంగళవారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం బంగారం కొనుగోలు చేస్తే తక్కువ ధరకే వస్తుంది. అయితే వెండిధరలు మాత్రం పెరుగుతున్నాయి. కొంత మంది బంగారానికి బదులు వెండిని కొనుగోలు చేయడంతో దీని ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 6న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,760గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.95, 740గా ఉంది. మే 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,750తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే మంగళవారం స్పల్పంగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దేశంలోని ప్రధాన నగారల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read : తగ్గిన బంగారం ధరలు.. పడిపోవడానికి కారణం ఇదే..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,910 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,890గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,760 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.95,740 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,760 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,740తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,760 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,740తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,760తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,740తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్పల్పంగా పెరిగినా.. వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,07.900గా నమోదైంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.96,900గా ఉంది. ముంబైలో రూ.96,900, చెన్నైలో రూ.1,07,900 బెంగుళూరులో 96,900, హైదరాబాద్ లో రూ. 1,07,900 తో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల కారణంగానే బంగారం ధరలు స్పల్పంగా డిమాండ్ ఉంటోంది. మొన్నటి వరకు ఇతర పెట్టుబడుల కంటే బంగారంపైనే ఎక్కువగా ఇన్వెస్ట్ మెంట్ చేశారు. కానీ ఇప్పుడు బంగారం నుంచి వేరేవాటికి మళ్లుతున్నారు. అయితే ఇదే సమయంలో వెండికి డిమాండ్ పెరుగుతోంది. వెండిపై ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : తగ్గిన బంగారం ధరలు.. పడిపోవడానికి కారణం ఇదే..