
మానవ జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాముఖ్యత ఎనలేనిది. తిండి, నిద్ర తర్వాత అత్యంత కీలకమైనది శృంగారమే. ఆడ, మగ ఇద్దరి జీవితంలోనూ ఇది సమానమైనది. కానీ.. దారుణమైన విషయం ఏమంటే.. ప్రపంచంలో అది కేవలం పురుషుల హక్కుగానే చెలామణి అవుతోంది. మగాడు ఆధిపత్యం చెలాయించే శృంగార సామ్రాజ్యంలో.. చాలా వరకు స్త్రీలు బానిసలుగానే పరిగణించబడుతున్నారు. ఈ విషయంలో మహిళల పట్ల దారుణమైన చర్యలకు సైతం పాల్పడుతున్నారు. మన పొరుగుదేశం చైనాలో శృంగారం కోసం మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఘోరంగా ఉంటోంది.
మహిళల బాహ్య రూపం చూసి.. వాళ్లు శృంగారంలో ఎలా ఉంటారో అంచనా వేసే మూఢత్వం అంతటా ఉంది. అలాంటి ఓ పద్ధతి చైనాలో అనాదిగా వస్తోంది. సంప్రదాయం, సంస్కృతి పేరుతో జరిగే ఈ దారుణం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. దీన్ని ఇప్పుడు అక్కడి మహిళలు వ్యతిరేకిస్తున్నారు. తాము ఈ పద్ధతికి వ్యతిరేకమని, తాము దీన్ని అంగీకరించబోమని నినదిస్తున్నారు.
ఇంతకూ ఆ పద్ధతి ఏమిటంటే.. చిన్న కాళ్లు ఉన్న మహిళలు శృంగారంలో బాగా సహకరిస్తారనే నమ్మకం చైనాలో ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. చైనాలోనే కాదు.. జపాన్, తైవాన్ లోనూ ఈ అభిప్రాయం ఉంది. అయితే.. చిన్నకాళ్లు ఎలా ఉంటాయి? పుట్టుకతో ఏదైనా లోపం ఉంటే పాదాలు చిన్నగా ఉండొచ్చు.. కానీ, సాధారణంగా జన్మించిన వాళ్ల పాదాలు చిన్నగా ఉండవు కదా. అందుకోసం వీళ్లు ఏం చేస్తారంటే.. ఆడవాళ్ల పాదాలు ఎదగకుండా చిన్నప్పటి నుంచే కట్టేస్తారు.

ఇలా కట్టేయడం ద్వారా.. వాళ్ల పాదాలు పెద్దగా ఎదగవు. ఇలాంటి వారు శృంగారంలో రెచ్చిపోతారని, మగాళ్లకు అనుకూలంగా ఉంటారన్నది అక్కడివారి నమ్మకం. ఇది వేలాది ఏళ్లుగా సాగుతున్న సంప్రదాయంగా చెబుతారు. అయితే.. ఇలా కట్టేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే..? ఆడవాళ్ల పాదాలు కుంచించుకుపోతాయి. పాదాలు కట్టి ఉంచినప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరగక, ఒత్తిడితో చాలా నొప్పి పుడుతుంది.
కేవలం మగాళ్ల శృంగారం కోసం తమను ఇలా హింసించడం సరికాదని గళం విప్పుతున్నారు చైనాలోని యువతులు. వారికోసం తాము నరకయాతన అనుభవిస్తున్నామని, ఇది ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. మారుతున్న కాలం ప్రకారం.. వారి ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. ఇలాంటి బంధనాలను తెంచుకోవడంతోపాటు.. పెళ్లికి ముందు శృంగారం తప్పేం కాదని కూడా వాదిస్తున్నారు అక్కడి అమ్మాయిలు. ఇలంటి వారి సంఖ్య దాదాపు 60 శాతం వరకు ఉండడం గమనార్హం.