spot_img
Homeపండుగ వైభవంVaralakshmi Vratham 2021: నేడే వరలక్ష్మీ వ్రతం.. ఇలా ఆచరిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం?

Varalakshmi Vratham 2021: నేడే వరలక్ష్మీ వ్రతం.. ఇలా ఆచరిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం?

Varalakshmi vratham specialశ్రావణ మాసం పండుగలు, శుభ కార్యాలతో పాటు వ్రతాలు జరుపుకునే కాలం అనే సంగతి తెలిసిందే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని(Varalakshmi Vratham) జరుపుకుంటారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు వ్రతాన్ని జరుపుకోవడం కుదరని వాళ్లు తర్వాత వారాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.

లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక కాగా లక్ష్మీదేవిని వరలక్ష్మి అని కూడా పిలుస్తారు. అత్తలు కొత్త కోడళ్లతో ఈ వ్రతం చేయించి కోడలికి పూజలతో పాటు పూజల ప్రాముఖ్యత తెలిసేలా చేస్తారు. కొత్త నగతో శ్రావణ వరలక్ష్మి పూజను చేయాల్సి ఉంటుంది. వరలక్ష్మీ దేవి కథలో చారుమతి అందరినీ కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉండటంతో పాటు భక్తిశ్రద్ధలతో అత్తామామలను సేవించుకున్నారు.

ఇందులో ఆమె తాను మాత్రమే వ్రతం చేసుకోవాలని భావించకుండా ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకున్నారు. వర్ణ భేదం లేదని సామూహికంగా వ్రతం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని చారుమతి నమ్ముతారు. చారుమతిలో ఉండే లక్షణాలలో కొన్ని లక్షణాలను అలవరచుకున్నా వ్రతం చేసిన ఫలితాన్ని పూర్తిగా పొందే అవకాశం అయితే ఉంటుంది.

పూజ అయ్యాక వాయనం ఇచ్చే సమయంలో “ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం” అని చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో వాయం పుచ్చుకునేదెవరని అడిగితే నేనే మంగళ గౌరీ దేవినని, నేనే సాక్షాత్తు శుక్రవార వరలక్ష్మీదేవినని చెప్పిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల సాటి వ్యక్తిని ఆరాధ్య దైవంగా భావించినట్లు అవుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper