Gujarat Lion Attack: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గిర్ అభయారణ్యం సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సింహాలను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ముగ్గురు యువకులు అక్రమంగా అడవిలోకి ప్రవేశించారు. అయితే వీరు సింహాలను చూసి తిరిగి వెళితె ఏ సమస్యా ఉండకపోవచ్చు. కానీ యువకులు కలయికలో ఉన్న సింహాలను రెచ్చగొట్టాడు. దీంతో సింహం తిరగబడింది. ఆ తరువాత ఏం జరిగిందంటే?
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు అనుమతి లేకుండానే గిర్ అభయారణ్యం వెలుపల ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కలయికలో ఉన్న సింహాల జంటను దగ్గరగా చూసేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. అంతేకాకుండా వాటిని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన మగ సింహం వారిపైకి దూసుకొచ్చింది.
ఈ దాడిలో 21 ఏళ్ల సోహిల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడగా, వారిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై గుజరాత్ రాష్ట్ర మంత్రి అరుణ్ మాట్లాడుతూ, అడవి జంతువులను దగ్గరగా చూడాలనే ఉత్సాహంతో రిజర్వ్ ఫారెస్ట్‌లోకి అక్రమంగా ప్రవేశించడం చట్టవిరుద్ధమని అన్నారు. ముఖ్యంగా కలయికలో ఉన్న వన్యప్రాణులను రెచ్చగొట్టడం అత్యంత ప్రమాదకరమని, ఈ నిర్లక్ష్యమే యువకుడి ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు.
అటవీశాఖ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గిర్ అటవీ ప్రాంతంలో పర్యాటకులు, స్థానికులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వన్యప్రాణులకు దూరంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. అడవిలో జంతువులను రెచ్చగొట్టడం లేదా వాటి సహజ జీవనానికి భంగం కలిగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు.
Watch: 21-year-old youth killed in a lion attack near the Luvariya Reserve Forest in Amreli. Forest officials suspect the lion attacked after the victim and his friend allegedly disturbed it while it was mating with a lioness. The male lion has since been captured, and an… pic.twitter.com/ypv9yv3SWQ
— DeshGujarat (@DeshGujarat) July 9, 2026
