జీహెచ్ఎంసీ మేయర్ గా కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. 2016 నుంచే మేయర్ పదవికోసం ఆమె రేసులో ఉననారు. ఉద్యమ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ కు ఆ అవకాశం దక్కింది. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా ఎన్నికయ్యారు.
Also Read: జమిలీకి కసరత్తు చేస్తున్న కేంద్రం..?
జీహెచ్ఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో మొదటి నుంచి ఆశావహులు గులాబీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. వచ్చారు. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ అధిష్టానం ఆమెవైపే మొగ్గు చూపింది. సీనియర్ నేత.. కేసీఆర్ సన్నిహితుడు.. కే. కేశవరావు కూతురు అయిన విజయలక్ష్మి… బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసిన విజయలక్ష్మి.. బాబిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 18 ఏళ్లుగా అమెరికాలో ఉన్నారు.
అమెరికాలో ఉన్న సమయంలో.. అమెరికాలోని ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలోని కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్ గా పని చేశారు. 2007లో భారత్ కి తిరిగి వచ్చారు. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు అమెరికా పౌరసత్వాన్ని వదిలివేశారు. 2016లో ఆమె టీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేశారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.
Also Read: కొత్త రేషన్ కార్డ్ కావాలా.. తెలంగాణలో ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే..?
హైదరాబాదులోనే విజయలక్ష్మి విద్యాభ్యాసం పూర్తి అయ్యింది. హోలీమేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. రెడ్డీ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత భారతీయ విద్యాభవన్ లో జర్నలిజం కోర్సు కూడా చేశారు. అనంతరం సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా కొనసాగబోతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్