https://oktelugu.com/

కేసీఆర్-ఓవైసీ దోస్తీ ‘గ్రేటర్’లో బయటపడింది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించినట్టే టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల సందర్భంగా బయటపడింది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సమానంగా సీట్లు సాధించిన జీహెచ్ఎంసీలో ఈ రెండు కలిస్తేనే మేయర్ పీఠం దక్కుతుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తన పాత దోస్తు ఎంఐఎంతో కలవడానికి రెడీ అయినా బీజేపీ ముందే తీవ్ర ఆరోపణ చేసింది. మతతత్వ ఎంఐఎంతో టీఆర్ఎస్ కలిసిందని.. హిందుత్వ ఓటును చీల్చే ప్రయత్నం చేసింది. ఈ పరిణామంతో కేసీఆర్ తెలివిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 / 05:20 PM IST
    Follow us on

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించినట్టే టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల సందర్భంగా బయటపడింది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సమానంగా సీట్లు సాధించిన జీహెచ్ఎంసీలో ఈ రెండు కలిస్తేనే మేయర్ పీఠం దక్కుతుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తన పాత దోస్తు ఎంఐఎంతో కలవడానికి రెడీ అయినా బీజేపీ ముందే తీవ్ర ఆరోపణ చేసింది. మతతత్వ ఎంఐఎంతో టీఆర్ఎస్ కలిసిందని.. హిందుత్వ ఓటును చీల్చే ప్రయత్నం చేసింది.

    ఈ పరిణామంతో కేసీఆర్ తెలివిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుల సంసారంలో వెనుకంజ వేశారు. నాన్చారు. బీజేపీ విమర్శలు ప్రజల్లోకి వెళ్లకుండా ఆ వేడిలోనే మేయర్ ఎన్నికను పెట్టలేదు. ఎంఐఎంతో పొత్తు లేదంటూ ఇరు పార్టీలు ప్రకటించాయి.

    తాజాగా మేయర్ ఎన్నిక వరకు కూడా ఎంఐఎం పోటీలో నిలబడుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఏ పార్టీకి మేయర్ పీఠం దక్కదని బీజేపీ నింపాదిగా ఉంది. కానీ చివరి నిమిషంలో ఎంఐఎం పోటీ నుంచి డ్రాప్ అయ్యి అధికార టీఆర్ఎస్ కు మద్దతు పలికింది.

    ఈ సడెన్ షాక్ తో బీజేపీ కార్పొరేటర్లు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలతో జీహెచ్ఎంసీలో హోరెత్తించారు. టీఆర్ఎస్, ఎంఐఎం తెరవెనుక దోస్తీ బయటపడినట్టైంది. ఎంఐఎం సపోర్టుతోనే మేయర్, డిప్యూటీ మేయర్ లను టీఆర్ఎస్ గెలుచుకుంది. కేసీఆర్ స్ట్రాటజిక్ గా చివరకు ఎంఐఎంను దూరంపెట్టి.. ఆ పార్టీ పోటీలో ఉన్నట్టు ప్రకటించి బీజేపీని గందరగోళ పరిచి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కానీ మరోసారి టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ మాత్రం బయటపడినట్టైంది.