నాన్నే.. జగన్ దైవం..

వైఎస్ ఆర్ బతికి ఉన్నంత కాలం ఆయన గురించి ఒక్క మంచిమాట అనని నాయకుడు చంద్రబాబు నాయుడు అని అంటు. అటువంటి చంద్రబాబు నాయుడు జగన్ కన్నా.. వైఎస్సార్ గొప్పవారని అంటున్నారు. ఆయన నిండు సభలో అనేకసార్లు వైఎస్సార్ తనకు మంచి స్నేహితుడి చెప్పారు. వైఎస్సార్ తో పోల్చితే.. జగన్ చాలా చిన్న నాయకుడని.. చాలా సార్లు ప్రస్తావించారు. ఇదివరకు చాలా మంది నాయకులు కూడా జగన్ ను ఆ కోణంలో విమర్శలు చేస్తూ.. వచ్చారు. Also […]

Written By: Srinivas, Updated On : February 11, 2021 5:07 pm
Follow us on


వైఎస్ ఆర్ బతికి ఉన్నంత కాలం ఆయన గురించి ఒక్క మంచిమాట అనని నాయకుడు చంద్రబాబు నాయుడు అని అంటు. అటువంటి చంద్రబాబు నాయుడు జగన్ కన్నా.. వైఎస్సార్ గొప్పవారని అంటున్నారు. ఆయన నిండు సభలో అనేకసార్లు వైఎస్సార్ తనకు మంచి స్నేహితుడి చెప్పారు. వైఎస్సార్ తో పోల్చితే.. జగన్ చాలా చిన్న నాయకుడని.. చాలా సార్లు ప్రస్తావించారు. ఇదివరకు చాలా మంది నాయకులు కూడా జగన్ ను ఆ కోణంలో విమర్శలు చేస్తూ.. వచ్చారు.

Also Read: ఏపీ, తెలంగాణలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. తొలిపోస్టింగ్ శ్రీకాకుళం జిల్లాలో. తరువాత వివిధ హోదాల్లో పని చేశారు. 2016లో రిటైర్డు అయ్యి.. తరువాత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నియామకం అయ్యు. అటువంటి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇన్నేళ్లకు ఒక సంచలనాత్మక విషయాలను చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే.. దానికి కారణం వైఎస్సార్ అంటూ.. గతాన్ని నెమరువేసుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ కు రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని.. ఎదుటివారి భావ ప్రకనట స్వేచ్ఛకు అవకాశం ఇస్తారని కూడా పొగిడారు. దాని అర్థం జగన్ కు చెప్పకనే చెప్పారు అన్నమాట.

Also Read: తిరుపతి బైపోల్ కూడా అప్పుడేనా..?

ఎన్టీఆర్ ను కుర్చీనుంచి దింపేసి మరీ ఆయన ముఖ్యమంత్రి పదవిని, పార్టీని చేజిక్కించుకున్న నేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి మొక్కుతారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు టీడీపీకి పడతాయి. బాబు ఎన్టీఆర్ కు కొడుకు కాదు.. అల్లడు మాత్రమే అన్న విషయాన్ని ఎవరూ ప్రస్తవించకుండానే పలుమార్లు గెలిపించుకుంటూ వచ్చారు. మామను వ్యతిరేకించిన చంద్రబాబుకే ఓట్లు పడినప్పుడు తండ్రి వైఎస్సార్ తో విభేదాలే లేని జగన్ కు ప్రజలు నీరాజనం ఎందుకు పట్టరని పలువురు అనుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్