https://oktelugu.com/

ఉత్తమ్‌ రిజైన్.. పీసీసీ ఎవరికి?

మొత్తానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి తన పదవికి రిజైన్‌ చేశారు. గ్రేటర్‌‌ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు రిజైన్‌ లెటర్‌‌ను పంపించారు. దీంతో నెక్ట్స్‌ పీసీసీ చీఫ్‌ ఎవరనే చర్చ మొదలైంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. Also Read: టీఆర్ఎస్ మేయర్ వ్యూహం ఏంటి? ఘోర పరాభావం గ్రేటర్‌‌ ఎన్నికల్లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 5, 2020 11:40 am
    Follow us on

    Uttam Kumar Reddy Resigns
    మొత్తానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి తన పదవికి రిజైన్‌ చేశారు. గ్రేటర్‌‌ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు రిజైన్‌ లెటర్‌‌ను పంపించారు. దీంతో నెక్ట్స్‌ పీసీసీ చీఫ్‌ ఎవరనే చర్చ మొదలైంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

    Also Read: టీఆర్ఎస్ మేయర్ వ్యూహం ఏంటి?

    ఘోర పరాభావం

    గ్రేటర్‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. ఒకప్పుడు మేయర్‌‌ పీఠాన్ని దక్కించుకొని హైదరాబాద్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్న పార్టీ ఇప్పుడు రెండండే రెండు డివిజన్లకు పరిమితం అయ్యింది. రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోనూ ప్రభావం చూపలేకపోయింది.

    ఉత్తమ్‌పై హైకమాండ్‌కు కంప్లైంట్స్‌

    కొంతకాలంలో ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్‌‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఆయనను మార్చకపోతే పార్టీకి మనుగడ ఉండదని హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. ఆయన కూడా ఏ ఎన్నికల్లోనూ తన మార్క్‌ చూపలేకపోయారు. ఆయన సొంతస్థానం హుజూర్‌‌నగర్‌‌ మొదలుకొని మొన్నటి దుబ్బాకలోనూ పార్టీ ఓడిపోయింది. తాజాగా గ్రేటర్‌‌లో చిత్తుగా ఓడడంతో పదవిని వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

    Also Read: బీజేపీకి అసలైన పరీక్ష నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. సత్తా చాటుతుందా?

    పీసీసీ సీట్‌లోకి రేవంత్‌దేనా..?

    ఉత్తమ్ తప్పుకోవడంతో పీసీసీ పదవి ఎవరికి దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. క్యాడర్ లో ఎక్కువమంది పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి పేరును సూచిస్తున్నారు. అధిష్టానం కూడా రేవంత్‌కు అవకాశం ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండేది, ప్రభుత్వంపై విమర్శలు చేసేది ఆయనే కాబట్టి.. దాదాపు ఖరారైనట్లే..! ఇదే జరిగితే కాంగ్రెస్‌ పరిస్థితులు మారే అవకాశం ఉంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్