https://oktelugu.com/

Upendra Dwivedi: జమ్మూవాసికే ఆర్మీచీఫ్ పదవి.. ఎందుకిచ్చారంటే?

Upendra Dwivedi: జనరల్ మనోజ్ పాండే నాలుగు దశాబ్దాల పాటు ఆర్పీ చీఫ్ గా పని చేశారు. ఇప్పుడు ఆయన స్థానంలోకి జనరల్ ద్వివేది వచ్చారు. తూర్పు, ఉత్తర, పశ్చిమ థియేటర్లలో కమాండ్లను, ఆర్మీ జవాన్లు సైతం తనతో తీసుకువచ్చారు ద్వివేది.

Written By:
  • Neelambaram
  • , Updated On : July 1, 2024 / 03:34 PM IST

    General Upendra Dwivedi takes charge as new army chief

    Follow us on

    Upendra Dwivedi: జమ్మూ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడులు, తూర్పు లద్దాఖ్ లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట చైనాతో ప్రతిష్టంభన వంటి అనేక భద్రతా సవాళ్ల మధ్య జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

    జనరల్ మనోజ్ పాండే నాలుగు దశాబ్దాల పాటు ఆర్పీ చీఫ్ గా పని చేశారు. ఇప్పుడు ఆయన స్థానంలోకి జనరల్ ద్వివేది వచ్చారు. తూర్పు, ఉత్తర, పశ్చిమ థియేటర్లలో కమాండ్లను, ఆర్మీ జవాన్లు సైతం తనతో తీసుకువచ్చారు ద్వివేది. కొన్నేళ్లుగా భద్రతా దళాలు, పౌరులే లక్ష్యంగా ఉగ్ర దాడులు పెరిగిన దరిమిలా జమ్ము ప్రాంతంలో సుస్థిరతను పునరుద్ధరించడం ప్రాధాన్యాంశాల్లో ఒకటి. జనరల్ ద్వివేది నార్తర్న్ ఆర్మీ కమాండర్ గా పనిచేశారు, రాజౌరీ-పూంచ్ బెల్ట్ లో మిలిటెంట్ల దాడులకు ప్రతిస్పందనగా గతేడాది ఈ ప్రాంతంలో చేపట్టిన స్పెషల్ టీముల్లో పనిచేశారు.

    జాతీయ భద్రతా నేపథ్యంలో గ్రేజోన్ యుద్ధంలో ద్వివేదీ కీలకపాత్ర పోషించారని ప్రభుత్వం ఆదివారం (జూన్ 30) ఒక ప్రకటన రిలీజ్ చేసింది. గ్రేజోన్ యుద్ధం అంటే అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉన్న ప్రాంతంగా చెప్పువచ్చు. తూర్పు లద్దాఖ్ లో ఏప్రిల్, 2020 నాటికి ఉన్న స్థితిని పునరుద్ధరించేందుకు భారత్, చైనా సైనిక, దౌత్య చర్చలను కొనసాగిస్తున్నందున లద్దాఖ్ నుంచి ఈశాన్యం వరకు స్థిరమైన ఎల్ఏసీని నిర్ధారించడం మరొక ప్రాధాన్యత.

    త్రివిధ దళాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను అనుసరించి సైనిక ఉన్నతాధికారులు ఇప్పటికే దీనిపై సమీక్షిస్తున్నందున జనరల్ ద్వివేది అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పథకంపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. నాలుగేళ్లు పూర్తయ్యే నాటికి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్లలో అధిక శాతాన్ని ఆర్మీ కోరుతున్నట్లు తెలిసింది.

    స్వదేశీ పరికరాలతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్మీని తయారు చేయడంపై కొత్త చీఫ్ దృష్టి సారించే అవకాశం ఉంది. దేశం శక్తివంతమైన, సమర్థవంతమైన సైనిక వ్యవస్థను తయారు చేయడం, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ఆయన ప్రేరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.