Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె నటించిన ఎన్నో సినిమాలు మంచి హిట్ లను సొంతం చేసుకున్నాయి. కానీ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు బ్యూటీ. అమ్మడు ఆరోగ్యం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ కెరీర్ ను రీస్టార్ట్ చేయడానికి సిద్దం అవుతుంది. దీంతో తన ఫ్యూచర్ ఫ్లాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సామ్.
ఇంతకీ ఈ బ్యూటీ ఏ చెప్పిందంటే..అవును నేను తప్పు చేశానని ఇంకోసారి ఇలాంటి తప్పు మళ్లీ చేయను అని పేర్కొంది బ్యూటీ. ఇంతకీ ఈమె చేసిన తప్పు ఏంటి అనుకుంటున్నారా? ఫుడ్ విషయంలో అంటుంది సమంత. ఆ మధ్య తన హెల్త్ ఇష్యూ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే ప్రస్తుతం ఇప్పుడు ఆరోగ్యం, ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి అని గట్టి నిర్ణయమే తీసుకుందట సామ్.
చివరిసారిగా విజయ్ దేవరకొండతో జతకట్టి ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సమంత. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సినిమా గురించి అప్డేట్ లేదు. సంవత్సరం గ్యాప్ లోనే ఉన్న సమంత ఇప్పుడు కెరీర్ ను రీస్ట్రార్ట్ చేసినా కూడా ఆమెకు సంబంధించి ఏ సినిమా గురించి అప్డేట్ లేదు. అయితే రెండు సినిమాల గురించి చర్చలు సాగుతున్నాయట కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే కేవలం హెల్ద్ గురించి మాత్రమే కాదు ప్రమోట్ చేసే ఆరోగ్యం ఆహారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాను అంటుంది.
ప్రమోట్ చేసే ఫుడ్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందట బ్యూటీ. ఆరోగ్యకరమైన ఫుడ్‌కి మాత్రమే బ్రాండింగ్ చేస్తానని.. తనలా మరొకరు బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందట సామ్. అయితే సమంత చేసిన ఈ కామెంట్ల గురించి తన అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.