Gender Equality Run: సమాజంలో నెలకొన్న అనేక అసమానతల్లో జెండర్ సమస్య కూడా ఒకటి. పని ప్రదేశంలో కావచ్చు.. ఇంకేదైనా ప్రదేవంలో కావచ్చు వారు కొంత వివక్షను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అయితే ఈ అసమానతలను తొలగించేందుకు మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్‌ను నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఇందులో సీపీ సీవీ ఆనంద్ తో పాటు ఇంకొందరు ఐపీఎస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి మహిళా లా అండ్ ఆర్డర్ ఎస్ హెచ్ వోను నియమిస్తున్నట్టు తెలిపారు సీవీ ఆనంద్. అయితే ఈ ఈక్వాలిటీ రన్ లో చాలామంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. 5కే, 3కే విభాగాలుగా పరుగులు తీశారు యువత.
మహిళా దినోత్సవాన్ని మూడు రోజులు నిర్వహిస్తామంటూ చెప్పారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. మహిళల కోసమే షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని, వారి కోసం తమ ప్రభుత్వం నిత్యం పాటు పడుతుందని తెలిపారు. ఇక పోలీస్ శాఖలో కూడా 33శాతం మహిళలకు ఇచ్చినట్టు గుర్తు చేశారు.

ఇక మహిలల కోసం ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్‌ను ఎస్ హెచ్ వోను తీసుకు రావడం అభినందనీయమంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక సీవీ ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా పోలీస్ శాఖలో క్రమక్రమంగా మహిళా ఉద్యోగులు పెరగడం ఆనందనీయం అన్నారు. రీసెంట్ గా 80మంది మహిళా ఎస్సైలు తమ శాఖలోకి వచ్చినట్టు ఆయన తెలిపారు.