Varun Tej Ghani Movie: హైటు.. ‘వెయిట్’.. ఉన్న మెగా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. మెగా నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పలు సినిమాల్లో నటించిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలు కాస్త నిరాశ పరిచినా వరుణ్ కు మాత్రం ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పారు. అయితే ఈ యంగ్ మెగా హీరోకు ‘ఫిదా’ మూవీ తరువాత తరువాత బ్లాక్ బస్టర్ హిట్టు ఒక్కటి తగలలేదు. ఆ తరువాత ఎన్నో సినిమాలు వచ్చినా మంచి బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఆయన లెటేస్టుగా వస్తున్న ‘గని’ సినిమా కోసం భారీ ‘కసరత్తు’లు చేస్తున్నాడు. అంతేనా.. ఆయనకు సపోర్టుగా తండ్రి నాగబాబు కూడా కసరత్తులు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో కొందరు ఫ్యాన్ష్ ‘గని.. గనికా బాప్ ఎక్సర్ సైజ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వస్తున్న ‘గని’ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో వరుణ్ తేజ్ కొత్తగా కనిపించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అయితే ‘గని’ కోసం వరుణ్ తేజ్ బాగానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఎందుకంటే మంచి ఫిట్ నెస్ తో కనిపించడంతో పాటు సిక్స్ ప్యాక్ రేంజ్ లో వరుణ్ బాడీ కనిపించడంతో ఆయన జిమ్ కసరత్తులపై ప్రధానంగా ఇంట్రెస్టు పెట్టినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కథ ఉండడంతో ఫిట్ ఉండడం కోసం వరుణ్ జిమ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Prabhas Biography: బయోగ్రఫీ: ప్రభాస్ ఎలా ఎదిగాడో తెలుసా?
సిద్దు ముద్ద, అల్లూ బాబీ సంయుక్తంగా నిర్మించిన ‘గని’ ఈనెల 25న రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేశారు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే థియేటర్లో ఈ మూవీ సందడి చేయనున్నట్లు సినీ యూనిట్ తెలుపుతోంది. ఇక క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. దీంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది. అయితే ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలోనే సినిమా ఉండనుందని అంటున్నారు.
అయితే తాజాగా వరుణ్, నాగబాబుల కలిసి జిమ్ లో చేస్తున్న కసరత్తులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల కొన్ని కామెంట్లతో నెట్టింట్లో హాట్ యాక్టర్ గా మారిన నాగబాబు తాజాగా జిమ్ చేస్తూ కనిపించడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా కొడుకు వరుణ్ తో కలిసి జిమ్ చేయడం మరింత సందడిగా మారింది. తండ్రి కొడుకులు కలిసి చాలా సందర్భాల్లో కనిపించినా ఇలా జిమ్ చేస్తూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పటి వరకు వరుణ్ తేజ్ సినిమాల్లో నాగబాబు కనిపించలేదు. అయితే ‘గని’లో నాగబాబు కనిపించేందుకే ఇలా కసరత్తు చేశాడా..? అనే చర్చ మొదలైంది.
Also Read: Genelia : సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా మొదలుపెట్టిన ‘హాసిని’ !