Radhe Shyam RRR Movie: టాలీవుడ్ బాలీవుడ్‌ని మించి చిత్రాలను నిర్మిస్తూ వసూళ్లను కూడా అదే స్థాయిలో రాబడుతోంది. త్వరలో తెలుగు నుండి వచ్చే రాధేశ్యామ్, RRR చిత్రాలు దాదాపు రూ. 800 కోట్లతో నిర్మితమయ్యాయి. ఇవి ఘనవిజయం సాధిస్తే ఎంతలేదన్నా రూ. 1500 కోట్ల నుండి రూ.2000 కోట్ల వరకూ వసూలు చేయొచ్చు. ఇక దక్షిణాది నుండి వచ్చే కేజీఎఫ్, బీస్ట్, పుష్ప-2 చిత్రాలను కూడా తీసుకుంటే దక్షిణాది సినిమా బాలీవుడ్‌ని ఓవర్ టేక్ చేసినట్టే.

పైగా ఈ భారీ సినిమాల గురించి ట్విటర్‌లో కూడా ఒక్కో రోజు పలు రంగాలకు సంబంధించిన విషయాలు ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. అయితే ఈ రోజు ఎంటర్‌టైనింగ్ విభాగంలో ‘‘తొక్కుకుంటూపోవాలే’’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో RRR చిత్రం, ఉపాసనతో దిగిన ఫొటోతో #రామ్ చరణ్ #రాధేశ్యామ్ ట్రెండింగ్ జాబితాలోకి వచ్చారు.
అలాగే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘పుష్ప’ సినిమాలోని ‘#తగ్గేదేలే’ అనగా అది కాస్త ట్విట్టర్లో ట్రేండింగ్ గా మారింది. మొత్తానికి మార్చి మొత్తం రాధేశ్యామ్, ‘ఆర్ఆర్ఆర్’ హడావుడే ఎక్కువగా ఉండనుంది. ఎలాగూ మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు.. ప్రీమియర్షో కోసం ఏకంగా థియేటర్నే బుక్చే శాడు.

అమెరికా ఫ్లోరిడాలోని టెన్సిల్ నగరంలోని థియోటర్లో మొత్తం 75 టికెట్లను కొనుగోలు చేశాడు. ఈ టికెట్లను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ఈ క్రమంలోనే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 10 గంటల్లోనే దాదాపు 5 లక్షల డాలర్లను సంపాదించింది.