https://oktelugu.com/

CM Jagan: ఆ రెండింటి మధ్య నలిగి.. జగన్ న్యాయం చేయలేకపోతున్నాడా?

CM Jagan:  వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ను ఇటీవల మరోసారి పునర్వవ్యస్థీకరించారు. పాత, కొత్త కలయికలో ఆంధప్రదేశ్ మంత్రివర్గం ఏర్పడింది. ప్రస్తుత క్యాబినేట్లో చోటు దక్కించుకున్న వారిని పరిశీలిస్తే.. వీరిలో ప్రతిభ కంటే కూడా కుల సమీకరణాలు, లాబీయింగ్ చేసిన వారికే మంత్రి పదవులు దక్కాయని అర్థమవుతోంది. ఏపీ క్యాబినేట్ కూర్పు ఎలా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన విశ్వసనీయతను పణంగా పట్టేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో […]

Written By: , Updated On : April 13, 2022 / 10:10 AM IST
Follow us on

CM Jagan:  వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ను ఇటీవల మరోసారి పునర్వవ్యస్థీకరించారు. పాత, కొత్త కలయికలో ఆంధప్రదేశ్ మంత్రివర్గం ఏర్పడింది. ప్రస్తుత క్యాబినేట్లో చోటు దక్కించుకున్న వారిని పరిశీలిస్తే.. వీరిలో ప్రతిభ కంటే కూడా కుల సమీకరణాలు, లాబీయింగ్ చేసిన వారికే మంత్రి పదవులు దక్కాయని అర్థమవుతోంది.

ఏపీ క్యాబినేట్ కూర్పు ఎలా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన విశ్వసనీయతను పణంగా పట్టేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో తన వెంట ఎంతో మంది నాయకులు కలిసి నడిచారు. కాలక్రమంలో మరికొంతమంది వచ్చి చేరిన సంగతి అందరికీ తెల్సిందే. వీరి వాళ్లే వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఇక జగన్మోహన్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టినవాళ్లు సైతం పదవుల కోసం వైసీపీలో చేరారు. ప్రస్తుత క్యాబినేట్లో ఇలాంటి వారికే జగన్మోహన్ రెడ్డి పెద్దపీఠ వేయడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన వెంట తొలి నుంచి నడిచిన కీలక నేతలకు మొండిచేయి చూపించడం హాట్ టాపిక్ గా మారింది.

జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి కొత్త పార్టీ పెట్టిన సమయంలో కొంతమంది ఎమ్మెల్యే, మంత్రి పదవులకు సైతం రాజీనామా చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. ఉప ఎన్నికలు వచ్చేలా చేసి తమ బలాన్ని నిరూపించారు. అలాంటి వారికి మాత్రం ప్రస్తుత మంత్రి వర్గంలో ఎలాంటి చోటు దక్కలేదు.

బాలినేని, సుచరితలను జగన్మోహన్ రెడ్డి తన క్యాబినేట్ నుంచి అవమానకర రీతిలో పంపించారు. నాడు జగన్ వెంట నడిచిన గొల్ల బాబురావు, ప్రసాదరాజు, బాలరాజు, పిన్నెల్లి వంటి వారికి ప్రాధాన్యం దక్కలేదు. పాత క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డికి నమ్మినబంటులుగా పని చేసిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లకు ఎలాంటి పదవులు దక్కలేదు.

ఇక బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి లాంటి నేతలు పదవులు అనుభవించి చివర్లో వైసీపీలో చేరారు. రోజా, విడుదల రజనిలు టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ రేంజులో ఆడేసుకున్నారు. నాడు వీరంతా జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇలాంటి వారికే పదవుల్లో జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన వాళ్లకు న్యాయం చేయడంలో మాత్రం విఫలమై తన విశ్వసనీయను కోల్పోయారనే అభిప్రాయం సర్వత్రా వ్యకమవుతోంది.