LPG Booking New Rules India 2026: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో చమురుపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. తమరు సరఫరా లో ఇబ్బందులు ఏర్పడడంతో వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. అయితే సరఫరా తగ్గిన నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతూ ఎక్కువగా సిలిండర్లను బుక్ చేస్తున్నారు. కొందరికి సిలిండర్లు అందుతుండగా మరికొందరికి కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని గమనించిన పెట్రోలియం కంపెనీలు నిబంధనలను కఠిన తరం చేశాయి. ఇప్పుడు ఒక్క కుటుంబం సిలిండర్ ను పొందాలంటే 25 నుంచి 45 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. అయితే దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే?
Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్
కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. సింగిల్ సిలిండర్ ఉన్న పట్టణ వినియోగదారులు ఒకసారి సిలిండర్ బుక్ చేస్తే మరో సిలిండర్ కోసం 25 రోజుల తర్వాతే అవకాశం ఏర్పడుతుంది. డబుల్ సిలిండర్ ఉన్న కుటుంబాలు 35 రోజుల తర్వాతే రీ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులు 45 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకోవాలి. ఈ గడువు కాకముందు బుక్ చేయడానికి ప్రయత్నిస్తే ఆన్లైన్ సిస్టం ఆటోమేటిగ్గా బ్లాక్ అవుతుంది.
ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎల్పిజి సరఫరా పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తంలో బుకింగ్స్ చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల గృహ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ మార్కెటింగ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి బుకింగ్ మధ్య గొడవలు పెంచినట్లు అధికారులు తెలుపుతున్నారు. డబుల్ సిలిండర్లు ఉన్న ఇళ్లలో ఒకటి ఫీల్ అయి ఉంటే మరొకటి ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలో అదనపు నిల్వ అవసరం తగ్గించేందుకు కంపెనీలు 35 రోజుల గ్యాప్ ను అమలు చేస్తున్నాయి. దీనివల్ల అందరికీ సమానంగా సిలిండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
అయితే కొంతమంది బుక్ చేసుకున్న తర్వాత రెండు నుంచి ఐదు రోజుల్లో డెలివరీ ఇవ్వాలని ఆయి కంపెనీలు చెబుతున్నాయి. అయినా కూడా కొన్ని నగరాలు గ్రామాల్లో సరఫరాలో ఒత్తిడి వల్ల ఆలస్యం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు ముందు జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు. గ్యాస్ పూర్తయ్య లోపు ముందుగానే వినియోగానికి ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఎంఎస్ లేదా ఓటీపీ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. అనధికారికంగా సిలిండర్లను కొనుగోలు చేసి మోసపోవద్దు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు అసలే కొనవద్దని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి దేశంలో గ్యాస్ కొరత లేదని కానీ బుకింగ్స్ తీవ్రం కావడంతో ఒత్తిడి పెరిగి సరఫరాలో ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వినియోగదారులు అవసరం అయితేనే బుకింగ్ చేసుకోవాలని అంటున్నారు.
