Ganta Srinivasarao: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామా చేశారు. కానీ ఇంతవరకు స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. దీంతో గంటా కూడా అసెంబ్లీకి రావడం లేదు. అయితే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఇచ్చినా దాన్ని ఆమోదించడంలో స్పీకర్ తాత్సారం చేస్తున్నారని తెలుస్తోంది. గంటా రాజీనామాను ఆమోదిస్తే అక్కడ ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అందుకే రాజీనామాను ఆమోదించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటా రాజీనామా అంశం మరోమారు తెరమీదకు వస్తోంది.
గంటా ఇటీవల కాలంలో జనసేనతో కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో జనసేనలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైసీపీని విమర్శలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా? లేదా? అనేది తేలడం లేదు.
Also Read: Janasena Pawan: ‘జనసేనాని’ గేర్ మార్చాల్సిందేనా?
ఇప్పటికే కాపు వర్గం నేతల్ని ఐక్యం చేసే దిశగా పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదివరకే అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చిన ఏ పార్టీ కూడా కాపులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా ఓట్ల కోసమే వాడుకుంటున్నాయని వారి వాదన. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ వర్గం నుంచి సీఎం అయ్యే అవకాశాలుండటంతో అందరు కలిసి రావాలని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.
గంటా రాజీనామా ఆమోదిస్తే ఆయన జనసేనలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గంటా శ్రీనివాస్ స్పష్టంగా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో జరిగే నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ సైతం విశాఖ ప్లాంట్ విషయంలో ఆందోళన చేసిన విషయం విధితమే. దీంతో రాజకీయంగా కలిసేందుకు ఇద్దరికి వేదిక కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Chiranjeevi – Salman Khan: అక్కడ చిరంజీవిని కలిసి ముచ్చట్లు పెట్టిన సల్మాన్ ఖాన్ !