Telugu Dubbed Malayalam Movies: మలయాళంలో ఈ మధ్య కాలంలో మంచి విజయం సాధించిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది “ఉడుంబు”. అందుకే, ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం చాలామంది పోటీ పడ్డారు. ఆ పోటీలో నిర్మాత గంగపట్నం శ్రీధర్ గెలిచాడు. “ఉడుంబు” రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. గంగపట్నం శ్రీధర్ గతంలో ‘అంజలి’ టైటిల్ పాత్రలో “చిత్రాంగద”, సుమంత్ తో ‘ఇదం జగత్” ఛార్మితో మంత్ర-మంగళ” వంటి పలు చిత్రాలతో పాటు… సుకుమార్ “కుమారి 21ఎఫ్” చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసాడు.
తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో “శివగామి” చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక మలయాళంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన “ఉడుంబు” అక్కడ మంచి విజయాన్ని సాధించింది. అందుకే, పలు తెలుగు అగ్రనిర్మాణ సంస్థలు “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ కోసం బాగా ఉత్సాహ పడ్డాయి. కానీ, ఈ చిత్రం హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: ‘ఎత్తర జెండా’ మధ్యలోనే ఆగిపోతే ఎలా రాజమౌళి ?
ఈ చిత్రం శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. మొత్తానికి మళయాళంలో మంచి హిట్టయిన సినిమాలను ఎక్కువలగా ఈ మధ్య తెలుగులోకి తీసుకువస్తున్నారు. విక్టరీ వెంకటేష్ “దృశ్యం, దృశ్యం-2″లతోపాటు ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన “భీమ్లా నాయక్” సినిమా కూడా మలయాళం నుంచి వచ్చిన సినిమాలే.
అలాగే మెగాస్టార్ నటిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రం కూడా మలయాళంలో రూపొంది సంచలన విజయం సాధించిన “లూసిఫర్”కు రీమేక్ అన్న విషయం కూడా గమనార్హం. ఈ కోవలోనే “ఉడుంబు” సినిమా కూడా తెలుగులోకి రాబోతుంది. మొత్తానికి తెలుగు సినిమాల కోసం హిందీ వాళ్ళు పోటీ పడుతుంటే.. మలయాళ సినిమాల కోసం తెలుగు వాళ్ళు పోటీ పడుతున్నారు.
Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ డేట్స్ !