Homeఆంధ్రప్రదేశ్‌Ganta Srinivasa Rao: మళ్లీ మోగిన రాజీనామా ‘గంటా’.. ఆమోదానికి స్పీకర్‌కు వినతి

Ganta Srinivasa Rao: మళ్లీ మోగిన రాజీనామా ‘గంటా’.. ఆమోదానికి స్పీకర్‌కు వినతి

Ganta Srinivasa Rao: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా అస్త్రాన్ని సంధించి సంచలనం రేపారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఏడాది క్రితం ఇచ్చిన రాజీనామా ప్రస్తుతం మరుగున పడింది. తాజాగా దానికి మళ్లీ తెరపైకి తెచ్చారు ఎమ్మెల్యే. ఈమేరకు తన రాజీనామా ఆమోదించాలని మరోమారు స్పీకర్‌ను కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తమ్మినేని సీతారాంకు రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు కూడా. కానీ స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ అంశం మరుగున పడిపోయింది. మధ్యలో ఓసారి రాజీనామా ఆమోదంపై కోర్టుకెళ్లాలని ఆయన అనుకున్నారు. కానీ ఎందుకో వెళ్లలేదు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన తర్వాత స్పీకర్‌కు ఆమోదించకపోవడానికి కారణాలు లేవు. కానీ ఆయన ఆమోదించలేదు. గంటా కూడా ఎప్పుడూ పెద్దగా పట్టుబట్టలేదు ఎప్పుడో ఓ సారి తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆమోదించుకోవాలంటే ధర్నాలు చేయడం లాంటివి చేసి ఉండేవారు. కానీ అలాంటివేమీ చేయలేదు.

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

ప్రధాని రాక నేపథ్యంలో మళ్లీ తెరపైకి..
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తున్నారు. ఈ సమయంలో స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి నేతలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా రాజీనామా అంశం మరోసారి హాట్‌ టాపిక్‌ అవుతోంది.

ప్రభుత్వం అనుకుంటే..
ఏపీలోనూ ఓ ఉపఎన్నిక తీసుకురావాలని వైసీపీ సర్కార్‌ అనుకుంటే తక్షణం ఆ రాజీనామాను ఆమోదించవచ్చు. మరోఆరు నెలల్లో ఉపఎన్నిక వస్తుంది. ప్రజా వ్యతిరేకత తమ వైపు లేదని నిరూపించుకోవడానికి వైసీపీకి అవకాశం ఉంటుంది. గతంలో బద్వేలు, ఆత్మకూరులాంటి చోట్ల ఉపఎన్నికలు జరిగినా .. అవి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల వచ్చాయి. ప్రతిపక్షం పోటీ పెట్టలేదు. అందుకే ఈసారి విశాఖలో అదీ కూడా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కాబట్టి వైసీపీకి చాన్స్‌ ఉంటుంది.

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

కానీ ఎందుకు రాజీనామాను ఆమోదించడం లేదన్న సందేహాలు వస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ సెంటిమెంట్‌ అంత ఎక్కువగా లేదని జీవీఎంసీ ఎన్నికల్లోనే తేలిపోయింది. అయినా.. గంటా రాజీనామా ఆమోదించడంలో తాత్సారంపై స్పీకర్‌ సరైన కారణం చూపకపోగా, ఆమోదం కూడా తెలపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version