
ప్రతిపక్షంలో ఉండాలని ఎవరూ కోరుకోరు. రాజకీయంగా కింది స్థాయి నుంచి వచ్చిన వారు తప్పితే ఈ కాలంలో ఎవరూ కూడా తాము ప్రతిపక్షం అని గట్టిగా నిలబడరు. ఇక పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్ లు అయితే ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలో చేరి తమ యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లేలా చూసుకుంటారు.
Also Read: 2024 రేసు : టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవచ్చేమో..
చాలా రోజులుగా ఏపీ రాజకీయాల్లో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సైలెంట్ గా ఉంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ లో వీరావేశంతో రెచ్చిపోయిన గల్లా ప్రతిపక్షంలోకి వచ్చాక ఎందుకో సైలెంట్ అయిపోయారు. ఇక తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జిల విషయంలో గల్లా ఫ్యామిలీని బాబు పక్కనపెట్టడంతో మనస్తాపం చెందిన గల్లా ఫ్యామిలీకి టీడీపీకి షాక్ ఇచ్చింది.
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక గల్లా కుటుంబం ఆస్తులు, ఫ్యాక్టరీలపై వైసీపీ ప్రభుత్వం నజర్ పెట్టింది. ఇటీవల చిత్తూరు జిల్లా సెజ్ లో భూమిని రద్దు చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో సైలెంట్ అయ్యారు.ఇక ఇటీవల పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జుల నియామకంలోనూ గల్లా ఫ్యామిలీని బాబు లెక్కలోకి తీసుకోలేదన్న ప్రచారం సాగింది. దీంతో గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరోను వీడినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలు అంటున్న పార్టీలో పరిణామాలు నచ్చకే వైదొలిగినట్టు సమాచారం.
ఇవన్నీ పరిణామాల మధ్య మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు గల్లా అరుణ కుమారి సడన్ గా టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకోవడం కలకలం రేపింది. తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ పొలిట్ బ్యూరోను వీడుతున్నట్లు ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొంది.
Also Read: దుర్గగుడిలో మరో అపచారం..
వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా గల్లా అరుణకుమారి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ తరుఫున గుంటూరు ఎంపీగా నిలబడి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈ క్రమంలో అరుణకుమారికి గౌరవం ఇచ్చి చంద్రబాబు ఆమె పార్టీకి ప్రధానమైన పొలిట్ బ్యూరోలో అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా పార్లమెంట్ ఇన్ చార్జిలలో గల్లా ఫ్యామిలీకి ప్రాధాన్యం లేకపోవడం.. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న వారికి ఇప్పుడు టీడీపీకి దూరమయ్యారు.
అరుణకుమారి ఎగ్జిట్ తో ఆమె కుమారుడు గల్లా జయదేవ్ కూడా టీడీపీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.