Kalabhairava Remote Aircraft: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మన సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. మన ఆయుధాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ఉగ్రస్థావరాలను కచ్చితమైన లక్ష్యంతో ధ్వంసం చేశాయి. పాకిస్తాన్ ప్రతిదాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ స్వదేశీ ఆయుధ తయారీపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవలే హైదరాబాగ్‌కు చెందిన సంస్థ మెషీన్ గన్స్ తయారు చేసింది. తాజాగా బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ (ఎఫ్‌డబ్ల్యూడీఏ) సంస్థ భారతదేశ తొలి స్వదేశీ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (ఎంఏఎల్‌ఈ) రిమోట్ యుద్ధ విమానం ‘కాల భైరవ’ను ఆవిష్కరించింది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సుహాస్ తేజస్కంద ఈ విమానం డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి పూర్తిగా భారతదేశంలోనే జరిగినట్లు తెలిపారు. ఈ ఘటన భారత రక్షణ రంగంలో స్వాతంత్య్రం, సాంకేతిక పురోగతికి నిదర్శనంగా నిలుస్తుంది.
Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!
కాల భైరవ సామర్థ్యాలు ఇవీ..
‘కాల భైరవ’ విమానం 3 వేల కిలోమీటర్ల దూరం, 30 గంటల వ్యవధితో ఏకబిగిన ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది ఏఐ ఆధారిత లక్ష్య గుర్తింపు, స్వయంచాలిత మిషన్‌లను నిర్వహించగల సాంకేతికతతో రూపొందించబడింది. ఈ డ్రోన్ సామర్థ్యాలు ఆధునిక యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా ఉండి, భారత రక్షణ బలగాలకు కీలకమైనవి. అంతేకాక, ఒక డ్రోన్ దెబ్బతిన్నప్పటికీ మిషన్ లక్ష్యాలను సాధించడంలో ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేసేలా రూపొందించబడింది, ఇది దాని విశ్వసనీయతను సూచిస్తుంది.
విదేశీ డ్రోన్‌లకు తీసిపోకుండా..
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ప్రిడేటర్ డ్రోన్ ధర సుమారు రూ.1,000 కోట్ల కాగా, ‘కాల భైరవ’ ధర దాని పదోవంతు మాత్రమే. ఈ ధరలోనే 10 కాల భైరవ డ్రోన్‌లను సొంతం చేసుకోవచ్చు, ఇది భారతదేశ రక్షణ బడ్జెట్‌కు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ఖర్చు–సమర్థత భారతదేశాన్ని రక్షణ రంగంలో ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడమే కాక, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచుతుంది. ఇప్పటికే దక్షిణాసియా దేశం నుంచి 25 లక్షల డాలర్ల విలువైన ఆర్డర్‌ను సాధించడం ఈ డ్రోన్ యొక్క అంతర్జాతీయ ఆదరణను సూచిస్తుంది.
దిగుమతులపై ఆధారపడకుండా..
విదేశీ రక్షణ సాంకేతికతపై ఆధారపడటంత్లో భారతదేశ వ్యూహాత్మక స్వాతంత్య్రం దెబ్బతినే ప్రమాదం ఉంది. అమెరికా వంటి దేశాల ఆంక్షలు, రహస్య సమాచార లీకేజీ ప్రమాదాలు దీనికి కారణాలు. ‘కాల భైరవ’ వంటి స్వదేశీ డ్రోన్‌ల అభివృద్ధి ఈ సమస్యలను అధిగమించి, భారతదేశ రక్షణ సామర్థ్యాలను స్వతంత్రంగా బలోపేతం చేస్తుంది. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా, దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ జాతీయ భద్రతను పటిష్టం చేస్తుంది.
‘కాల భైరవ’ ఆవిష్కరణ భారతదేశాన్ని అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలబెట్టింది. 30 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతి ఒప్పందం సాధించడం ద్వారా, భారతదేశం ఆయుధ దిగుమతిదారుగా కాకుండా ఎగుమతిదారుగా మారుతోంది. ఈ డ్రోన్ సాంకేతిక ఆధునికత, ఖర్చు–సమర్థత ద్వారా ఇతర దేశాలకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఇది భారతదేశ రక్షణ ఉత్పత్తుల గ్లోబల్ డిమాండ్‌ను పెంచుతోంది.