Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh: ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థకం.. రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి అక్కర్లేదా?

Andhra Pradesh: ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థకం.. రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి అక్కర్లేదా?

Andhra Pradesh: కేంద్రం ఏపీకి చట్టబద్ధంగా ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు. చట్టంలో ఉన్న విషయాలపైన స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి లేదా ఒప్పించి, మెప్పించి రాష్ట్రప్రయోజనాల కోసం ఎంపీలు పని చేయాల్సి ఉంది. తమకు న్యాయ బద్ధంగా ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలని డిమాండ్ చేయాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం ఇవ్వని పక్షంలో నిరసన తెలిపి, ప్రధానమంత్రికి వినతులు సమర్పించి సాధించుకోవాల్సి ఉంది. కానీ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీలు ఇవేమీ చేయకుండా ఏం చేస్తున్నారంటే..

Andhra Pradesh
Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలనే డిమాండ్ రాష్ట్రం డివైడ్ అయిన నాటి నుంచి ఉంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. కాగా, కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి ఏపీ ఎంపీలు సాధించుకోవాలి. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి కూడా చేయాలి. కానీ, అటువంటి పరిస్థితులు అయితే ఏం కనబడటం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం పేర్కొంటోంది. ఈ క్రమంలోనే ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వేజోన్, ఇతర ప్రాజెక్టుల గురించి కేంద్రం అస్సలు స్పందించడం లేదు.

ఏపీకి న్యాయబద్ధంగా కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు కనీస మాత్రంగానైనా నిరసన తెలపడం లేదు. లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ కేంద్రాన్ని నిలదీయకపోగా కనీసంగా ప్రశ్నించడం లేదు. రాష్ట్రప్రయోజనాల కోసం కాకుండా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపైన విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఢిల్లీలో రాష్ట్రప్రయోజనాల కోసం ఎంపీలు పోరాడటం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Also Read: KA Paul: కేఏ పాల్‌ తీరే వేరప్పా!

అన్నమయ్య ప్రాజెక్టు డ్యాం వైఫల్యం ఏపీ రాష్ట్ర సర్కారుదేనని కేంద్ర మంత్రి చెప్తున్న నేపథ్యంలో సైతం వైసీపీ ఎంపీలు కామ్‌గానే ఉన్నారు. విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రుల మాటలను సీరియస్‌గా వింటుడటం గమనార్హం. రాష్ట్రప్రయోజనాల కోసం కనీస ఆందోళన కాదు కదా.. కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం లేదన్న చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీలే తమ రాష్ట్రం ఏపీ గురించి ఆలోచించనపుడు ఇక కేంద్రప్రభుత్వం ఎందుకు ఏపీ గురించి ఆలోచిస్తుందన్న వాదన కూడా వినబడుతోంది. ఏపీ రాష్ట్రప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీయబోతున్నదని, పరిమితికి మించి అప్పులు చేస్తోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వంపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రఘురామకృష్ణరాజు సైతం కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

Also Read: Cinema Tickets: సినిమా టికెట్​ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వంపై నిర్మాత సి కళ్యాణ్​ సంచలన వ్యాఖ్యలు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version