ఆడబిడ్డలపై కన్నేస్తే అంతిమయాత్రే: యోగి వార్నింగ్

  ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో  లవ్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఈ లవ్ జీహాద్ పేరుతో అమాయకులైన అమ్మాయిలను మోసం చేస్తూ బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న కేసులు ఎక్కువ అయ్యాయి. దీంతో గొడవలు, హత్యలు, కేసులు పెట్టుకోవడం పెరిగిపోతోంది. కొన్ని సంఘాలు దీనికి మద్దతు ఇస్తూ పెంచిపోషిస్తున్నాయని తేలింది. ఈ క్రమలోనే లవ్ జిహాద్ ను అరికట్టేందుకు యూపీ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ మేరకు తమ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని […]

Written By: NARESH, Updated On : November 1, 2020 10:55 pm
Follow us on

 

ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో  లవ్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఈ లవ్ జీహాద్ పేరుతో అమాయకులైన అమ్మాయిలను మోసం చేస్తూ బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న కేసులు ఎక్కువ అయ్యాయి. దీంతో గొడవలు, హత్యలు, కేసులు పెట్టుకోవడం పెరిగిపోతోంది. కొన్ని సంఘాలు దీనికి మద్దతు ఇస్తూ పెంచిపోషిస్తున్నాయని తేలింది.

ఈ క్రమలోనే లవ్ జిహాద్ ను అరికట్టేందుకు యూపీ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ మేరకు తమ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకువస్తుందంటూ యోగి ఆధిత్యనాథ్ సంచలన విషయాలను వెల్లడించారు..  ఆడబిడ్డలతో ఎవరూ ఆటలాడినా వారికి అంతిమయాత్ర నిర్వహిస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లను కూడా అంటిస్తామని స్పష్టం చేశారు. ఈ హెచ్చరిక దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఒకవేళ యువకులు వినకపోతే వారికి అంతిమ యాత్ర మొదలైనట్లేనని యూపీ సీఎం తీవ్రంగా హెచ్చరించారు. పెళ్లి కోసం మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

హిందూ యువతులపై కన్నేస్తే వారికి అంతిమయాత్రేనని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూపీలో మతాంతర కార్యకలాపాలను పూర్తిగా నివారించేందుకు యోగి ప్రభుత్వం తీవ్ర కసరత్తలు మొదలుపెట్టింది. ఈ మేరకు కఠిన చట్టాలు చేయనున్నట్లు సీఎం యోగి ఆధిత్యనాథ్ తెలిపారు.

యూపీలోని మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో శనివారం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొని ఈ హెచ్చరికలు పంపారు.