ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కొత్త పథకాల అమలు ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తాజాగా మరో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోంది. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలను మంజూరు చేయనుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్లు చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి బ్యాంకులకు పంపనున్నారు.
Also Read: ‘ఏం భాష స్వామి అది’.. సీఎం జగన్ భాషపై టీడీపీ ట్రోల్
రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది వీధివ్యాపారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీళ్లలో ఇప్పటికే 7 లక్షల మంది బ్యాంకులకు దరఖాస్తులను సమరించారు. జగన్ సర్కార్ రుణాలకు అర్హులైన వారికి గుర్తింపు కార్డులను మంజూరు చేయనుంది. ఇప్పటికే 4.3 లక్షల మందికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాగా మిగిలిన వాళ్లకు రుణాలు మంజూరు కావాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీన సీఎం జగన్ ఈ స్కీంను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
పల్లెలు, పట్టణాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగులవెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో తాత్కాలిక లేదా శాశ్వత దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. తలపై గంపలో వస్తువులను మోస్తూ అమ్మేవాళ్లు, తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకునే వాళ్లు కూడా ఈ స్కీమ్ కు అర్హులే. 18 ఏళ్లు నిండి గ్రామాల్లో రూ. 10 వేలు, పట్టణాల్లో రూ. 12 వేలు కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: విజయవాడపై కొత్త ప్రతిపాదన ఇదీ
దరఖాస్తు చేసే వాళ్లు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. వీధి వ్యాపారులకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే గ్రామ, వార్డ్ వాలంటీర్లు వారితో కొత్తగా పొదుపు అకౌంట్ ను ప్రారంభించేలా సహాయసహకారాలు అందిస్తారు. జగన్ పాదయాత్ర సమయంలో వీధి వ్యాపారులు పడుతున్న కష్టాలాను స్వయంగా చూసి 10,000 రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరక్ జగనన్న తోడు పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్