మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

దేశంలో కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. తొలివిడుత లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగిస్తుందగా మరోసారి లాక్డౌన్ పొడగించింది. ఈ లాక్డౌన్ మే3వరకు కొనసాగనుంది. ఈ మేరకు లాక్డౌన్ ముగుస్తుండటంతో కేంద్రంగా మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. దేశంలోని మొత్తం 733 జిల్లాల పరిస్థితిని అంచనా వేసి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. లాక్డౌన్ ముగిశాక కూడా కొన్ని జోన్లలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 12:48 pm
Follow us on


దేశంలో కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. తొలివిడుత లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగిస్తుందగా మరోసారి లాక్డౌన్ పొడగించింది. ఈ లాక్డౌన్ మే3వరకు కొనసాగనుంది. ఈ మేరకు లాక్డౌన్ ముగుస్తుండటంతో కేంద్రంగా మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. దేశంలోని మొత్తం 733 జిల్లాల పరిస్థితిని అంచనా వేసి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. లాక్డౌన్ ముగిశాక కూడా కొన్ని జోన్లలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఏపీలో 1403 కు చేరుకున్న కేసులు… ఇళ్లలోనే చికిత్స

దేశంలో కరోనా కొత్త జోన్లను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో 130జిల్లాలు రెడ్ జోన్లలో, 284జిల్లాలు ఆరెంజ్ జోన్లలో, 319జిల్లాలు గ్రీన్ జోన్లలో ఉన్నట్లు ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 19 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీలో 11, బెంగాల్ లో 10 జిల్లాలు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్లలో ఉండగా, తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయి. కరోనా కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలుగా విభజించినట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రతీ సుడాన్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు జోన్లలో కొన్ని మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.