https://oktelugu.com/

హిట్లున్నా ఆచి తూచి అడుగులేస్తున్న యంగ్ హీరో

ప్రస్తుతం తెలుగు సినిమా అంతా యూత్ మయమే అవుతోంది. యువ హీరోలు , యువ దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. పెళ్లి చూపులు చిత్రంతో మొదలైన యువ కెరటాల వెల్లువ ఆ తరవాత “అర్జున్ రెడ్డి , ఆర్ ఎక్స్ 100 , మహానటి , బ్రోచేవారెవరురా , ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ “వంటి చిన్న చిత్రాలు , వినూత్న ప్రయోగాలతో వెండితెర పై దర్శనమిచ్చి విజయాన్ని అందుకొన్నాయి. ఆ క్రమంలో విజయ్ దేవరకొండ, […]

Written By:
  • admin
  • , Updated On : May 1, 2020 / 12:41 PM IST
    Follow us on


    ప్రస్తుతం తెలుగు సినిమా అంతా యూత్ మయమే అవుతోంది. యువ హీరోలు , యువ దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. పెళ్లి చూపులు చిత్రంతో మొదలైన యువ కెరటాల వెల్లువ ఆ తరవాత “అర్జున్ రెడ్డి , ఆర్ ఎక్స్ 100 , మహానటి , బ్రోచేవారెవరురా , ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ “వంటి చిన్న చిత్రాలు , వినూత్న ప్రయోగాలతో వెండితెర పై దర్శనమిచ్చి విజయాన్ని అందుకొన్నాయి. ఆ క్రమంలో విజయ్ దేవరకొండ, కార్తికేయ , శ్రీ విష్ణు , నవీన్ పోలిశెట్టి వంటి యువ హీరోలు వెలుగులోకి వచ్చారు.

    సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

    అలా తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి హిట్ సొంతం చేసుకున్న హీరోల్లో ఒకడు న‌వీన్ పోలిశెట్టి. ” ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ” సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీలో నవీన్ పోలిశెట్టి పేరు మారుమోగి పోయింది.. అతడి కామెడీ టైమింగ్‌కి చాలామంది ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా యూత్‌లో న‌వీన్ పోలిశెట్టి క్రేజ్ అమాతం పెరిగిపోయింది. కాగా నవీన్ లేటెస్ట్‌గా “జాతిరత్నాలు” అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా చేశాడు. .స్వప్న సినిమా బ్యానర్ ఫై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా , అనుదీప్ కె. వి. దర్శకుడిగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ ముగియగానే థియేటర్స్‌కి రానుంది.

    రెడ్ జోన్ లో ఐదు జిల్లాలు..!

    ఇక “జాతిరత్నాలు ” సినిమా హిట్ అయితే తన రేంజ్ మారిపోతుంది అని నవీన్ పోలిశెట్టి దృడంగా నమ్ముతున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తరవాత హిందీలో చేసిన ” చిచోరే ” చిత్రం తో మరో సూపర్ హిట్ అందుకొన్న నవీన్ పోలిశెట్టి రాబోయే ప్రోజెక్టుల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.

    ఇక బాల‌య్యబాబు , బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో తాను ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న‌ట్లు వార్తల పై నవీన్ స్పందిస్తూ ఆ సినిమాలో నేను చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేద‌ని.. అదంతా కేవలం పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశాడు.