Russia Ukraine War: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ఆందోళన ఏదైనా ఉందా అంటే అది రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. చాలా రోజులుగా ఇరు దేశాల నడుమ యుద్ధం కొనసాగుతోంది. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గకుండా భీకర పోరు చేస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య చాలా సార్లు శాంతి చర్చలు జరిగాయి. కానీ ఏవీ సక్సెస్ కాకపోవడంతో యుద్ధం మాత్రం ఆగట్లేదు.

బలమైన సైనిక బలగం ఉన్న రష్యా ప్రత్యర్థి ఉక్రెయిన్ పై మారణ హోమాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే చాలా దాడులు చేస్తూ ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలతో చెడుగుడు ఆడుతోంది. ఇక తక్కువ సైన్యం ఉన్నప్పటికీ ఉక్రెయిన్ కూడా భీకరంగా పోరాడుతోంది. ఏ మాత్రం భయపడట్లేదు. అధ్యక్షుడు జెలెన్ స్కీ నేతృత్వంలో మాతృభూమి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.
Also Read: ఆ విషయంలో జగన్ భయపడుతున్నారా.. మడమ తిప్పేస్తున్నారా..?
కాగా ఈ యుద్ధంలో కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా రష్యన్ సైనికుల మృతదేహాలను అలాగే వదిలేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీటిపై అనేక కథనాలు వస్తున్నాయి. రష్యన్ సైనికుల మృతదేహాలు మంచులో కూరుకుపోతున్నాయి. అయితే వాటిని అలా ఎందుకు వదిలేశారంటూ ఓ జర్నలిస్టు ఉక్రెయిన్ సైనికులను ప్రశ్నించాడు.

దానికి వారు సమాధానం ఇస్తూ.. ఆ మృతదేహాలను కుక్కలు తినేందుకు వదిలేస్తున్నామని సమాధానం ఇచ్చారు ఉక్రెయిన్ సైనికులు. తమ మాతృభూమి కోసం తీవ్రంగా పోరాడుతున్నామని, తమ వారిని కాపాడుకుంటామంటూ చెబుతున్నారు. అయితే ఇలా శవాలను కుక్కల కోసం వదిలేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ యుద్ధం కారణంగా నష్టపోతున్నారు.
Also Read: అమ్మఒడి.. నాన్న బుడ్డి, ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు వైరల్
[…] Lyricist Kandikonda Passes Away: సినీ గేయ రచయిత కందికొండ గారి మరణం తెలుగు చలన చిత్ర సీమకే కాదు.. తెలుగువారికి కూడా విషాదకరమైన సంఘటనే. సినీ ప్రముఖులు, అభిమానులు కందికొండ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కందికొండ గారిని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన సన్నిహితులు తరలివస్తున్నారు. అందరూ కన్నీళ్లతో ఆ అక్షర శిల్పికి అశ్రునివాళి అర్పిస్తున్నారు. […]
[…] Sniper Wali: ప్రస్తుతం ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న విషయం ఉక్రెయిన్-రష్యా యుద్ధం. బలవంతమైన రష్యా తన సైనిక బలగంతో ఉక్రెయిన్ పై రణరంగాన్ని సృష్టిస్తోంది. రష్యా సాగిస్తున్న మారణ హోమంలో ఉక్రెయిన్ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాదిమంది దేశం విడిచి పారిపోతున్నారు. ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిగినా.. అవి సక్సెస్ కాకపోవడంతో.. రష్యా మరింత వేగంగా దాడులు సాగిస్తోంది. […]