OKTelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే..ఇప్పటివరకు బాలకృష్ణని బోయపాటి చూపినంత పవర్‌ఫుల్‌గా ఎవరూ చూపలేదనే చెప్పాలి. బోయ-బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి చిత్రం ఒకదానిని మించి మరోటి అనేలా విజయాన్ని సాధించాయి. ఈక్రమంలో బాలయ్య-గోపిచంద్ మలినేని కలయికలో వచ్చే చిత్రం కూడా అదే ఫార్మాట్లో ఉంటుందని సమాచారం. కన్నడ చిత్రం మఫ్టీకి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో భారీ మార్పులే చేసి పవర్‌ఫుల్‌గా మార్చాడట క్రాక్ డైరెక్టర్ గోపి.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా స్క్రీన్స్లో రిలీజ్ అయింది. కలెక్షన్ల పరంగా తొలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఒక్కరోజులో రూ.48 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా సాధించినట్లు సమాచారం. నైజాంలో రికార్డ్ స్థాయిలో రూ.15.50 కోట్లు అందుకున్నట్లు టాక్. యూఎస్‌లో ప్రీమియర్స్‌తో కలిపి 1.4 మిలియన్ల డాలర్లు వచ్చాయి.
Also Read: రామ్ సినిమాలో జాన్వీ కపూర్ ?

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే..కార్తి నటించిన ఖైది, విజయ్-విజయ్ సేతుపతిల మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్‌తో తీస్తున్న చిత్రం విక్రమ్. యాక్షన్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శంకర్‌తో భారతీయుడు-2 పక్కనపెట్టి మరీ కమల్ ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని మార్చ్ 14న ఉ. 7 గంటలకు తెలుపనున్నట్టు అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రంలో విశాల్ నటనకు అవార్డు వస్తోంది అని కామెంట్స్ చేశాడు ప్రముఖ నటుడు సముద్రఖని.
Also Read: బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్
[…] Mohan Babu vs Nayi Brahmins: మోహన్ బాబు దగ్గర పది సంవత్సరాల నుండి మేకప్ మెన్ గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్. ఇతను నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వాడు. అయితే శ్రీనివాస్ పై మోహన్ బాబు వృద్ధ సింహంలా గర్జించి బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. పైగా ఎందుకు గొడవ అని అడిగినందుకు శ్రీనివాస్ పై మోహన్ బాబు బూతులతో విరుచుకు పడ్డారు. దాంతో మళ్ళీ తాజాగా మంచు మోహన్‌బాబు, విష్ణును తక్షణమే అరెస్టు చేయాలని తూ.గో జిల్లా రాజోలు మండల నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. […]
[…] Bellamkonda Suresh Reaction On Cheating Case: నిర్మాత బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్ పై చీటింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదు అయిన చేసిన సంగతి తెలిసిందే. శరణ్ నుంచి తీసుకున్న రూ. 85 లక్షలను తిరిగి ఇవ్వకుండా.. మోసం చేశారు అని, డబ్బులు ఇవ్వకపోవడంతో శరణ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో.. కోర్టు 406, 417, 420, 120 రెడ్‌విత్ 156 ఆఫ్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. […]