Charles-3 Coronation : చార్లెస్ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్ మినిస్టర్ అబే శోభాయమానంగా వెలిగిపోయింది. ఈ వేడుకకు వివిధ దేశాల నుంచి అధినేతలు వచ్చారు. మత పెద్దలు హాజరయ్యారు. చార్లెస్ ను అభినందించారు. వచ్చిన అతిథులకు కూడా రాజవంశీకులు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పటిదాకా మీడియా కూడా రాజు పట్టాభిషేకం మీద మాత్రమే దృష్టి సారించింది. ఆ హడావిడిలో పడిపోయి ఒక కప్ప గురించి చెప్పడం మర్చిపోయింది.
ఇంతకీ ఏమిటి ఆ కప్ప
చార్లెస్ పట్టాభిషేకానికి సంబంధించి లండన్ లో గత కొన్ని నెలలుగా పనులు కొనసాగాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియా, వెబ్ సైట్ లలో కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ పట్టాభిషేకం కార్యక్రమానికి సంబంధించి మరొక వార్త కూడా తెగ హల్ చల్ చేస్తోంది. బ్రిటిష్ రాజ కుటుంబంతో, చార్లెస్ చక్రవర్తితో ఒక కప్ప ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. ఈ వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాయల్ ఫ్యామిలీ అధికారిక వెబ్సైట్ ప్రకారం “హయో సెర్టస్ ప్రిన్స్ చార్లేసి” అనే పేరు గల అరుదైన చెట్టు కప్పను ప్రిన్స్ చార్లెస్ మ్యాగ్నిఫిషియంట్ ట్రీ ఫ్రాగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కప్ప అలాంటిది ఇలాంటిది కాదు. దీనిని ఈక్వేడార్ లో కనుగొన్నారు. వాస్తవానికి కప్ప వర్షాణ్యాలను, వాటి ఆవాసాలను కాపాడేందుకు సహాయపడుతుంది. కాబట్టి దీనికి ప్రిన్స్ చార్లెస్ అని పేరు పెట్టారు. ప్రిన్స్ చార్లెస్ పర్యావరణాన్ని రక్షించేందుకు పాటుపడటం, ఆ తరహా ప్రచారాలు చేసే వారికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు. అతడి గౌరవార్థమే ఈ కప్పకు ఆ పేరు పెట్టారు.
పూర్తి విభిన్నం
ఇతర కప్పల కంటే ఈ కప్ప పూర్తి విభిన్నం. అత్యంత అరుదుగా కనిపిస్తుంది. గోధుమ రంగులో, ఇతర కప్పల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. దీని శరీరమంతా నారింజ రంగులో పెద్ద మచ్చలు ఉంటాయి. దీనిని ఈక్వేడార్ కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ లూయీస్ ఎ. కలోమా కనుగొన్నారు. ఇతను కప్ప జాతులను సంరక్షించే మ్యుజియాల కోసం కప్పను అన్వేషిస్తున్నప్పుడు దీనిని గుర్తించారు.
గోల్డెన్ ఆర్బ్ పేరుతో..
కింగ్ చార్లెస్ పట్టాభిషేకాన్ని “ఆర్చి బిషప్ ఆఫ్ కాంటెర్ బరి” ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలో చక్రవర్తి చార్లెస్, అతడి భార్య కెమిల్లా పట్టాభిషిక్తులు అయ్యారు. ఈ వేడుకకు బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాలు పెట్టిన పేరు ఆపరేషన్ గోల్డెన్ ఆర్బ్. ఈ పట్టాభిషేకంతో కింగ్ చార్లెస్ అధికారికంగా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు అధిపతి అయ్యారు. ఆ పదవికి ఉన్న అన్ని హక్కులు కూడా పొందారు.
Recognising his work towards conservation, a group called Amphibian Ark (whose aim is to ensure the survival of amphibious species) named a recently discovered frog species after our King! It's name is ‘Hyloscirtus Princecharlesi', meaning Prince Charles Stream Tree Frog. pic.twitter.com/AbS0E9CcSx
— Poplar Nurseries Ltd (@PoplarNurseries) May 4, 2023