https://oktelugu.com/

అర్హులందరికీ ఉచిత టీకా: మోడీ హామీ

కరోనా కల్లోలం వేళ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి దేశ ప్రజలకు భరోసానిచ్చారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ లో తాజాగా దేశంలోని వైద్యసిబ్బందికి సూచనలు చేస్తూ కరోనా తీవ్రత గురించి మాట్లాడారు. దేశం తొలి దశ కరోనా తీవ్రతను సమర్థంగా ఎదుర్కొందని.. తుఫాన్ లా విరుచుకుపడ్డా రెండో దశ కరోనా తీవ్రత ఇప్పుడు యావత్తు దేశాన్ని అతలాకుతలం చేస్తోందని మోడీ పేర్కొన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే నిపుణులు, శాస్త్రవిజ్ఞానం రంగం అందిస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2021 / 12:29 PM IST
    Follow us on

    కరోనా కల్లోలం వేళ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి దేశ ప్రజలకు భరోసానిచ్చారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ లో తాజాగా దేశంలోని వైద్యసిబ్బందికి సూచనలు చేస్తూ కరోనా తీవ్రత గురించి మాట్లాడారు.

    దేశం తొలి దశ కరోనా తీవ్రతను సమర్థంగా ఎదుర్కొందని.. తుఫాన్ లా విరుచుకుపడ్డా రెండో దశ కరోనా తీవ్రత ఇప్పుడు యావత్తు దేశాన్ని అతలాకుతలం చేస్తోందని మోడీ పేర్కొన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే నిపుణులు, శాస్త్రవిజ్ఞానం రంగం అందిస్తున్న సలహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ సూచించారు.

    ఈ కష్ట సమయంలో రాష్ట్రాలకు కావాల్సిన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఆక్సిజన్ కొరతను తీరుస్తామని.. టీకాల పంపిణీని వేగవంతం చేస్తామని.. అర్హులందరికీ కేంద్రమే ఉచితంగా టీకా అందజేస్తుందని మోడీ హామీ ఇచ్చారు.

    కరోనా వ్యాక్సిన్లపై వస్తున్న వదంతులను దేశ ప్రజలు నమ్మవద్దని మోడీ కోరారు. కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు మోడీ తెలిపారు. అన్ని రంగాల వారు ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు.