దేశంరో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో పాటు చలి పెరుగుతోంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై అడుగు పెడితే చలికి గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చలికాలమైనా దేశంలో మద్యం వినియోగం తగ్గడం లేదు. అయితే అధికారులు, వైద్య నిపుణులు చలికాలంలో మద్యం తాగకపోతేనే మంచిదని సూచనలు చేస్తున్నారు.
Also Read: పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..?
చలికాలంలో మద్యం తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియా ప్రజలు మద్యం వినియోగం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు వెల్లడిస్తున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరం రోజున చాలామంది మద్యం తాగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే చలికాలం తగ్గే వరకు మద్యానికి దూరంగా ఉంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఫుడ్ ప్రచారంపై నిషేధం..?
మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో నేటి నుంచి తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చలిగాలుల వల్ల జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ప్రత్యేకం
చలికాలంలో ప్రజలు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని.. విటమిన్ సి ఉండే పండ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ప్రజలు ఈ కాలంలో మాయిశ్చరైజర్లను వినియోగించి చర్మాన్ని రక్షించుకోవాలని అధికారులు సూచించారు. వేసవికాలం మొదలయ్యే వరకు ప్రజలు మద్యం సేవించడానికి దూరంగా ఉంటే మన్చిది.