Prashant Kishor: ఏపీ రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీటీ కావడం సంచలనం గా మారింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం పీకే వ్యూహకర్తగా పనిచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఐప్యాక్ టీం వైసిపి తో తెగదెం పులు చేసుకుందని.. ఏపీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐప్యాక్ సంస్థ స్పందించింది. వచ్చే ఎన్నికల్లోను తాము వైసిపి గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేసింది.
గత ఏడాది నుంచి ఐప్యాక్ టీం వైసిపి కోసం పనిచేస్తోంది. రిషి రాజ్ సింగ్ నేతృత్వంలో ఆ బృందం ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తోంది. ఇది పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిషోర్ టీం. 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ విజయం సాధించేందుకు తమ సంస్థ విశ్రాంతి లేకుండా పని చేస్తుందని ఆ సమస్త స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఏపీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు జగన్ను మరోసారి ఎన్నికల్లో గెలిపించి అధికారంలోకి తెస్తామని కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
వాస్తవానికి ఐపాడ్ టీమ్ ను స్థాపించింది వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కానీ తాను ఐపాడ్ నుంచి బయటకు వచ్చినట్లు గతంలోనే ప్రకటించారు. రాబిన్ శర్మ, శాంతాన్ సింగ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంను ఏర్పాటు చేశారు. దేశంలో చాలా రాజకీయ పార్టీలకు ఈ టీం పని చేసింది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్కు పనిచేసిన సునీల్ కొనుగోలు సైతం ఈ టీం నుంచి వచ్చిన వారే. ఇందులో రాబిన్ శర్మ టీం టిడిపికి పనిచేస్తోంది. ఐపాక్ నుంచి బయటకు వెళ్లిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతగా మారారు. శనివారం ఆయన సడన్ గా ప్రత్యేక విమానంలో నారా లోకేష్ తో కలిసి విజయవాడ వచ్చారు. చంద్రబాబు భేటీ అయ్యారు. దీంతో అప్రమత్తమైన ఐపాక్ టీం ప్రత్యేక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఐప్యాక్ టీం వైసీపీకి పనిచేస్తుండగా.. వ్యవస్థాపకుడు పీకే మాత్రం టిడిపికి పనిచేస్తుండడం విశేషం.