Homeజాతీయ వార్తలుEx TV9 CEO Ravi Prakash: రాహుల్ గాంధీతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ భేటీ

Ex TV9 CEO Ravi Prakash: రాహుల్ గాంధీతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ భేటీ

Former TV9 CEO Ravi Prakash: తెలంగాణాలో కాంగ్రెస్ బలోపేతం చేయడం కాంగ్రెస్ కీలక నేత రాహూల్ గాంధీ ద్రుష్టిసారించారు. అందులో భాగంగా మేధావులు, మీడియా సంస్థల అధినేతలతో ఆయన సమావేశమయ్యారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుందిు. శుక్రవారం వరంగల్ లో నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభ’ విజయవంతం కావడంతో రాహుల్ మరింత దూకుడు పెంచారు. మీడియా అధిపతులు, మేధావులు, తెలంగాణా ఉద్యమకారులతో హైదరాబాద్ లోని హోటల్ తాజ్ క్రిష్ణలో సమావేశమయ్యారు. అందులో భాగంగా రవిప్రకాష్ రాహుల్ గాంధీని కలుసుకున్నారు. తెలంగాణా కాంగ్రెస్ లో లోటుపాట్లు, తీసుకోవాల్సిన నష్ట నివారణ చర్యలు గురించి రాహుల్ రవిప్రకాష్ అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వీరి భేటీతో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో తెలంగాణాపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని.. అందులో భాగంగానే రవిప్రకాష్ పేరు తెరపైకి వచ్చిందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. ప్రస్తుతం తెలంగాణాలో అన్ని పార్టీలకు పత్రికలు, టీవీ చానళ్లు ఉన్నాయని.. కాంగ్రెస్ కు మీడియా సపోర్టు అవసరమని.. అవసరమైతే ఓ సొంత చానల్ ను ఏర్పాటు చేయాలని పీకే సూచించించినట్టు కథనాలు వచ్చాయి. అందుకే రవిప్రకాష్ తో రాహుల్ గాంధీ సమావేశం కాగానే.. రవిప్రకాష్ నేత్రుత్వంలో కాంగ్రెస్ ఒక చానల్ ను ఏర్పాటు చేయనుందని కథనాలు నడిచాయి. అయితే పత్రికలు, మీడియా ప్రతినిధులతో సమావేశంలో భాగంగానే రవిప్రకాష్ కలిశారని.. దీనికి ప్రత్యేక ప్రాధాన్యత అంటూ ఏదీ లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Former TV9 CEO Ravi Prakash
Ravi Prakash, Rahul Gandhi

చాన్నాళ్లకు తెరపైకి..

తెలుగునాట రవిప్రకాష్ సుపరిచితులు. టీవీ9 సీఈవోగా సుదీర్ఘ కాలం పనిచేశారు. అత్యుత్తమ తెలుగు చానల్ గా తీర్చిదిద్దారు. కానీ కొన్నేళ్ల కిందట జరిగిన పరిణామాలతో టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్ ను సాగనంపింది. చానల్ నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణ కూడా రవిప్రకాష్ పై ఉంది. అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. వివాదం కోర్టు వరకూ నడిచింది. అటు తరువాత రవిప్రకాష్ తెరమరుగయ్యారు.

Also Read: Telangana Politics: టెన్షన్‌ పాలిటిక్స్‌ : జాతీయ నేతల రాకతో టీఆర్‌ఎస్‌లో గుబలు.. ఫ్లెక్సీలు.. ట్వీట్‌లతో ఎదురు దాడి.

అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కావడం రకరకాల ఊహాగానాలకు తెరలేపాయి. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం అదో చిన్న సమావేశంగా కొట్టి పారేస్తున్నాయి. ఊహించనంత ప్రాధాన్యతేమీ లేదని లైట్ తీసుకుంటున్నాయి. అయితే రాహుల్ సభ విజయవంతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్‌లో ఉంది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాహుల్‌గాంధీతో సభ నిర్వహించడం ఇదే తొలిసారి. తొలి సభే విజయవంతం కావడంతో టీపీసీసీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా సభకు వచ్చిన జనాన్ని ఉత్తేజితం చేసేలా రాహుల్‌గాంధీ ప్రసంగించారు. పార్టీ క్రమశిక్షణ, టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండబోదన్న స్పష్టత ఇచ్చే విషయంలో దూకుడుగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకోవడంపైనా రాహుల్‌గాంధీ దృష్టి పెట్టారు. రైతు సంఘర్షణ సభ తరహాలోనే ఆదివాసీ సభ ఒకటి ఉంటుందని ప్రకటించారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రతిపాదనకూ మద్దతు ప్రకటించారు.

మీడియా సపోర్టుకు..

Former TV9 CEO Ravi Prakash
Radha Krishna

మరోవైపు ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణతో సైతం రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణాలో కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పత్రిక, చానల్ పరంగా పూర్తి సహకరించాలని కోరినట్టు సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కార్యక్రమాలను పతాక శిర్షీకన వండి వార్చుతున్న ద్రుష్ట్యా కీలక ప్రతిపాదనలను రాహుల్ ముందు రాధాక్రిష్ణ ఉంచినట్టు సమాచారం. అందుకు కాంగ్రెస్ అధినేత సైతం ఒప్పుకున్నట్టు తెలిసింది. అయితే పీకే ప్రతిపాదనల్లో భాగంగానే రాహుల్ పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా ప్రచారం చేశాయి. పత్రిలకు నేతలకు జాకెట్ యాడ్ లు సైతం ఇచ్చారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను మీడియా ద్వారా కొంత హైప్ చేయించాలన్న ప్రయత్నాల్లో రాహుల్ గాంధీ ఉన్నట్టు తేటతెల్లమవుతోంది.

Also Read:AP Incidents: ఏపీలో అగని అఘాయిత్యాలు.. రాజకీయ లబ్ధికి పాకులాడుతున్న జగన్, చంద్రబాబులు

వరంగల్ డిక్లరేషన్ ఆచరణ సాధ్యమేనా ? | Analysis on Congress Party Declaration for Farmers | View Point

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version