Telangana Politics: టెన్షన్‌ పాలిటిక్స్‌ : జాతీయ నేతల రాకతో టీఆర్‌ఎస్‌లో గుబలు.. ఫ్లెక్సీలు.. ట్వీట్‌లతో ఎదురు దాడి.

Telangana Politics: ఇన్నాళ్లూ తమకు ఎదురే లేదని భావించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎక్కడో గుబులు మొదలైనట్లు కనిపిస్తోంది. జాతీయ పార్టీల నేతల వరుస పర్యటనలు గులాబీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో ప్రజల్లో అధికార పార్టీలపై సహజంగానే వ్యతిరేకత నెలకొంది. ఇది ఇటీవలి హుజూరాబాద్‌ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో జాతీయ నేతల రాష్ట్ర పర్యటనలు అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు […]

Written By: NARESH, Updated On : May 7, 2022 1:29 pm
Follow us on

Telangana Politics: ఇన్నాళ్లూ తమకు ఎదురే లేదని భావించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎక్కడో గుబులు మొదలైనట్లు కనిపిస్తోంది. జాతీయ పార్టీల నేతల వరుస పర్యటనలు గులాబీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో ప్రజల్లో అధికార పార్టీలపై సహజంగానే వ్యతిరేకత నెలకొంది. ఇది ఇటీవలి హుజూరాబాద్‌ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో జాతీయ నేతల రాష్ట్ర పర్యటనలు అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సభలకు భారీగా జనం తరలివస్తుండడం.. ఎక్కడ తేడా కనిపిస్తుందని గులాబీ నేతలు భావిస్తున్నారు.

Revanth Reddy, KCR, Bandi Sanjay

ఎదురు దాడే అస్త్రంగా..
సాధారణంగా టీఆర్‌ఎస్‌ మంత్రులు, సీనియర్‌ నాయకులు ఇన్నాళ్లూ తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని నమ్మే వారు. ఎక్కడ సభలు, సమావేశాలు, ప్రెస్‌మీట్లు పెట్టినా.. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల గురించే పదేపదే ప్రచారం చేసుకునేవారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించేవారు. దేశానికి దిక్సూచి తెలంగాణ అని చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పథకాల ప్రచారాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు దీటుగా తిప్పి కొడుతున్నాయి. సంక్షేమాన్ని వైఫల్యాలు, గతంలో ఇచ్చిన హామీలు డామినేట్‌ చేసేలా తిప్పికొడుతున్నారు. దీంతో గులాబీ నేతలో అంతర్మథనం మొదలైంది. తాము కూడా ఎదురు దాడి చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పార్టీ నేతలకు సూచించారు. దీంతో మంత్రుల నుంచి మొదలు దిగువస్థాయి నేతల వరకూ రాష్ట్రానికి వస్తున్న జాతీయ నేతలే లక్ష్యంగా వివిధ రూపాల్లో ఎదురు దాడి ప్రారంభించారు.

Also Read: Interesting Mumbai And Gujarat match : ఆసక్తికరంగా ముంబై, గుజరాత్ మ్యాచ్.. హార్థిక్ పాండ్యా రనౌట్ తో గుజరాత్ ఓటమి

వైట్‌ చాలెంజ్‌ పేరుతో ఫ్లెక్సీలు..
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనకు మూడు రోజుల ముందు ఆయన నేపాల్‌లో ఓ పబ్‌లో ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీనిని ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని గులాబీ నేతలు భావించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తార కరామారావు ఆదేశాలతో హైదరాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలో వైట్‌ చాలెంజ్‌ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాహుల్‌ వైచ్‌ చాలెంజ్‌కు సిద్ధమా అని ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు. దీంతో అప్రమత్తమైన టీకాంగ్రెస్‌ నేతలు దీటుగా తిప్పికొట్టారు.

కేటీఆర్‌కు రేవంత్‌ రివర్స్‌ పంచ్‌
వైట్‌ చాలెంజ పేరుతో టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. అసలు వైట్‌ చాలెంజ్‌ విసిరింతే దానని, దమ్ముంటే కేటీఆర్‌ వైట్‌ చాలెంజ్‌కు ముందుకు రావాలన్నారు. తాను డ్రగ్స్‌పై నిలదీస్తే కోర్టుకుపోయి స్టే తెచ్చుకున్న కేటీఆర్‌ తన క్యాడర్‌తో రాహుల్‌ గాంధీకి వైట్‌ చాలñ ంజ్‌ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దమ్ముంటు కేటీఆర్‌ ముందుగా వైట్‌చాలెంజ్‌ స్వీకరించి తన వెంట్రుకలు, గోళ్లు, రక్త నమూనాలు పరీక్షకు ఇచ్చి రాహుల్‌తోపాటు మరో ఇద్దరికి వైట్‌ చాలెంజ్‌ విసరాలని సవాల్‌ చేశారు. తానే రాహుల్‌ను వైట్‌ చాలెంజ్‌కు తీసుకొస్తానని స్పష్టం చేశారు. దీంతో రాహుల్‌ పబ్‌ వీడియో తమకు ప్రచారాస్త్రం అవుతుందనుకున్న గులాభీ నేతలు రేవంత్‌ చాలెంజ్‌తో సైలెంట్‌ అయ్యారు.

Revanth Reddy, KCR, Bandi Sanjay

ఇప్పుడు ట్వీట్ల వార్‌..
తాజాగా గులాబీ నేతలు ట్వీట్ల వార్‌ మొదలు పెట్టారు. రాహుల్‌ అడుగు పెడుతున్న వేళ్ల కేటీఆర్, కవిత, వినోద్‌రావు, నిరంజన్‌రెడ్డి ట్విట్టర్‌ మోత మోగిస్తున్నారు.

– తెలంగాణలో రాహుల్‌ పర్యటనను ప్రశ్నిస్తూ రాహుల్‌ నిర్వహించేది రైతు సంఘర్షన సభ కాదని, రాహుల్‌ సంఘర్షణ సభ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేయగా,

– తెలంగాణ గురించి పార్లమెంట్‌లో ఎన్నిసార్లు, తెలంగాణ సమస్యలపై ఎప్పుడైనా పోరాడారా, ధాన్యం కొనుగోలుపై ఎందుకు మాట్లాడలేదు. తెలంగాణ సమస్యలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదు అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు అని ట్వీట్‌ చేశారు.

– ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌రావు కూడా ట్విట్టర్‌ వేదికగానే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని, మీరు పాలించే రాష్ట్రాల్లో రైతులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని సూచించారు.

– వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కూడా శుక్రవారం ఒక ట్వీట్‌ చేశారు. తెలంగాణ రైతులకు రైతుబంధు, రైతుబీమా, ప్రతీ ఎకరాకు సాగునీరు ఇస్తున్నామని, సంతోషంగాఉన్న రైతులను బాధపెట్టడానికే రాహుల్‌ వస్తున్నారు అని పేర్కొన్నారు. దమ్ముంటే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి రైతులను ఆదోకోవాలని సూచించారు.

దీటుగా స్పందిస్తున్న కాంగ్రెస్‌..
టీఆర్‌ఎస్‌ నేతల ట్వీట్లపై కాంగ్రెస్‌ నాయకులు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నారు. తిప్పి కొడుతున్నారు. కవిత ట్వీట్‌పై స్పందించిన రేవంత్‌రెడ్డి, నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు, కేంద్రానికి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని కేసీఆర్‌ సంతకం చేసినప్పుడు, తెలంగాణలో రైతులను వరి వేయొద్దన్నప్పుడు మీరు ఎక్కడున్నారని ప్రశ్నించారు. మాజీ ఎంపీ హనుమంతరావు, మధుయాష్కీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తున్నారు. అధికారంలో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన టీఆర్‌ఎస్‌ నేతలు రాహుల్‌ గాంధీని ప్రశ్నించడం సిగ్గుచేటని విమర్శించారు.

ఏది ఏమైనా.. జాతీయ నేతల పర్యటనపై టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఎదురు దాడి చూస్తుంటే.. ఎక్కడో తేడా కొడుతున్నట్లు కనిపిస్తోందని మాత్రం రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read:Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి మెడకు చుట్టుకున్న జాబ్ మేళాల వివాదం.. సజ్జలకు వివరణ ఇచ్చిన వైనం

Tags