Chandrababu Comments On Allainces: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మూడు రోజుల క్రితం చేపట్టిన జిల్లాల పర్యటనతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా శుక్రవారం గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు జగన్ సర్కాన్‌ను ఢీకొట్టేందుకు అందరం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాపోరాటం రావాలన్నారు. త్యాగాలకు సిద్ధమని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమయ్యాయి.
ఒంటిగా కష్టమే అని…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రజల్లో ఇంకా బలంగా ఉంది. ఎన్నికలు జరిగి మూడేళ్లు అయినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు. చంద్రబాబు మూడు రోజుల పర్యటనలోనూ, టీడీపీ నాయకులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్‌లోనూ ఇవే అంశాలు గుర్తించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. అప్పటì లోగా పార్టీని బలంగా తీసుకుపోవడానికి పెద్దగా ప్రభుత్వ వైఫల్యాలు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం తగిన సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల నాటికి కూటమిగా ముందుకు పోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై పోరాటానికి కలిసిరావాలని పిలుపు ఇచ్చారు.
జనసేనతో పొత్తు కోసమే..
2024 సాధారణ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలని టీడీపీ అధినేత భావించడం లేదు. ప్రస్తుత ఉన్న పరిస్థితిలో జగన్ సర్కార్‌పై వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా వైసీపీకే లాభం కలుగుతుందని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో వైసీపీకి 45 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 35 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ 6 శాతంపైగా ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు 2 శాతం బీజేపీకి 1.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనతో కలిసి పోటీ చేయడమే ఉత్తమమని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పర్యటనలో ఎక్కడా బీజేపీ, జనసేనలపై విమర్శలు చేయడం లేదు. కేవలం వైసీపీ టార్గెటగానే తన జిల్లాల పర్యటన సాగిస్తున్నారు. వచ్చే మహానాడు నాటికి పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 35 శాతం ఓట్లకు జనసేనకు ఉన్న 6 శాతం ఓటు బ్యాంకు కలిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని లెక్కలేసుకుంటున్నారు. జనసేనతో చేతులు కలిపేందుకు స్ధిమైనట్లు కనిపిస్తోంది.
బీజేపీతో జనసేన..
మరోవైపు జనసేన రెండ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈమేరకు రెండు పార్టీలకు అవగాహన కూడా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఇటీవల పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ప్రయత్నాలు ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. ఐక్యమవుతామంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు రెండు రోజుల్ల కర్నూల్ పర్యటనలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
బాబు ప్లాన్ 2.. త్రిముఖ వ్యూహం..
టీడీపీతో జనసేన పార్టీ పొత్తకు మొగ్గు చూపని పక్షంలో అవసరమైతే మళ్లీ బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయాని కూడా భావిస్తున్నట్లు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీపీ పవన్‌కళ్యాణ్ బయటి నుంచి మద్దతు ఇచ్చారు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2024లోనూ ఇదే రిపీట్ కావాలంటే జనసేనతో పొత్తే మేలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేన టీడీపీతో కలిసి పనిచేయాలంటే.. బీజేపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ఇందుకు టీడీపీ సారథ్యం వహించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీతో కొనసాగుతున్న గ్యాప్..
2019 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. జనసేన బీజేపీతో కలిసి ఉండడం, టీడీపీకి మద్దతు ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌పీసీ ఘన విజయం సాధించింది. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ బీజేపీతో కలిసి పనిచేయాలని భావించింది. కానీ బీజేపీ టీడీపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.