Kanna Lakshminarayana: ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రూటు మార్చారా? బీజేపీ పై అసంతృప్తిగా ఉన్నారా? పార్టీని వీడుతున్నారా? వీడితే ఆయన టీడీపీ వైపు మొగ్గుచూపుతారా? లేకుంటే జనసేనలో చేరుతారా? ఇప్పుడు కన్నా ముందున్న ఆప్షన్లేమిటి? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవే హాట్ టాపిక్. జనసేన అధ్యక్షుడు పవన్ విషయంలో బీజేపీ సరిగ్గా వ్యవహరించలేదని కన్నా తాజాగా ఆరోపించారు. సోము వీర్రాజు అధ్యక్షుడిగా వచ్చిన తరువాతే సమస్యలు పెరిగాయని చెప్పారు. అంతటితో ఆగకుండా అనుచరులు, అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని కూడా ఢిల్లీ పెద్దలను కోరారు. దీంతో కన్నా వ్యవహార శైలి అంతటా చర్చనీయాంశమైంది, ఆయన పార్టీని వీడడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది.

ఏపీలో పొలిటిక్స్ లో కన్నా లక్ష్మీనారాయణది యాక్టివ్ రోల్. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కీలక పోర్టు పోలియోలు సైతం నిర్వహించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టాప్5లో కొనసాగారు. రాష్ట్ర విభజన తరువాత యాక్టివ్ పాలిటిక్స్ కు కొద్దిరోజులు దూరమయ్యారు. అనూహ్యంగా కొద్దిరోజులకు బీజేపీలో ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీలో బీజేపీ స్పీడు పెంచారు. అయితే సోము వీర్రాజు అధ్యక్షుడిగా అయిన తరువాత ఏపీలో కన్నాలక్ష్మీనారాయణ పరపతి తగ్గినట్టు కనిపించింది. ఒకానొక దశలో ఆయన పార్టీని వీడుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా బీజేపీపై పవన్ కామెంట్స్ తో కన్నా లక్ష్మీనారాయణ బయటకు వచ్చారు. పవన్ తో మైత్రి కొనసాగింపు విషయంలో సోము వీర్రాజు ఫెయిలయ్యారని కూడా కామెంట్స్ చేశారు. ఆ తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాలని కూడా హైకమాండ్ కు విన్నవించారు. అంటే ఇంకా ఆయన బీజేపీ కోర్టులోనే బంతి ఉంచారు.
అయితే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్లే చాన్స్ లేదన్న టాక్ నడుస్తోంది. ఎన్ఎస్ యూఐ తో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఇప్పటివరకూ యాంటీ టీడీపీ కాన్సెప్ట్ తోనే కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కీలక పదవులు కూడా నిర్వర్తించారు. అయితే గత కొద్దిరోజులుగా ఆయన టీడీపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అమరావతి ఉద్యమంలో టీడీపీ నేతలతో కలిసే వేదిక పంచుకున్నారు. అదే సమయంలో గుంటూరు 2 నియోజకవర్గంపై కూడా ఫోకస్ పెంచారు. ఇప్పటివరకూ పెద్దకురపాడు నుంచి పోటీచేస్తూ వచ్చిన ఆయన గుంటూరు 2 నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ వెయిట్ చేస్తోంది. కన్నా వస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న యోచనలో ఉంది.

అటు కన్నా జనసేనకు దగ్గరవుతారన్న ప్రచారం నడుస్తోంది. ఆది నుంచి ఆయన పవన్ పై సానుకూలంగా ఉన్నారు. సామాజికవర్గపరంగా పవన్ వెంట నడుస్తారని కూడా టాక్ నడిచింది. గత ఎన్నికల తరువాత జనసేన, బీజేపీ కలిసే నడిచాయి. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా కొనసాగిన వరకూ రెండు పార్టీల మధ్య మంచిన సంబంధాలే కొనసాగాయి. అందుకే కన్నా కూడా సోము వీర్రాజును కార్నర్ చేయడం వెనుక.. నాడు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉన్న మంచి సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ పవన్ ను దూరం చేసినందుకు ఆక్షేపించారు. సో ఆయన బీజేపీని వీడితే ఫస్ట్ ఆప్షన్ గా జనసేనను ఎంచుకుంటారని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం సాగుతోంది.