Unstoppable With NBK 2: ‘అన్ స్టాపబుల్’ షో తో బాలయ్య యూత్ లో క్రేజీ హోస్ట్ అయిపోయాడు. సినిమాల్లోనే కాకుండా యాంకర్ గా తాను హీరోనేని నిరూపిస్తున్నాడు. సినీ, రాజకీయ ప్రముఖులను ఈ ప్రొగ్రాంకు రప్పించి వారి మనసులోని విషయాలు బయటపెడుతూ వారితో హంగామా చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే చాలా మందితో షో నిర్వహించిన ఈ హీరో ఇప్పుడు ఇద్దరు సినీ భామలతో ఎంజాయ్ చేయనున్నారు. బాలయ్య ఉత్సాహం చూసి ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారట. కానీ బాలయ్య బాబు ప్లాన్ ప్రకారం గెస్టులను పిలుస్తూ ఆడియన్స్ లో జోష్ పెంచుతారు. ‘అన్ స్టాపబుల్ 2’ మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన అల్లుడు నారాలోకేశ్ వచ్చారు. రెండో ఎపిసోడ్లో విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ లు హాజరై అలరించారు. ఇప్పుడిక ఓ సీనియర్ నటి.. ఓ జూనియర్ నటి షోకు అడుగుపెట్టనున్నారు. వాళ్లెవరో చూద్దామా..?

దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగలో బాలకృష్ణ అనేక సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీకి వచ్చే కొత్త భామలతో పాటు స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేశారు. వీరిలో రమ్యకృష్ణ ఒకరు. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. ఈ నటి ఉన్న సినిమాలను అప్పటి యూత్ ఇష్టపడి చూసేవారు. ఈ తరుణంలో బాలకృష్ణతో రమ్యకృష్ణ చేసిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. వీరి కాంబినేషన్లో బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో రొమాన్స్ చేసిన వీరు ఇప్పుడు ‘అన్ స్టాపబుల్ 2’ వేదికగా కలుసుకోబోతున్నారు.
మరో హీరోయిన్ రాశిఖన్నా ఈ షోకు రానున్నారట. నేటి గ్లామరస్ హీరోయిన్లలో రాశిఖన్నా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించిన ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించకపోయినా తమిళంలో దూసుకుపోతుంది. అంతేకాకుండా హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంది. ఈ క్రమంలో ‘అన్ స్టాపబుల్ 2’ ప్రొగ్రాంను ఫాలో అవుతున్న రాశిఖన్నా ఇప్పటికే ఆమె తరుపున ప్రశంసలు అందించిందట. దీంతో ఈ షోకు ఆమెను ఆహ్వానించినట్లు టాక్.

‘అన్ స్టాపబుల్ 1’ సక్సెస్ గా రన్ అయిన సందర్భంగా ఈనెల 14 నుంచి రెండో భాగం ప్రారంభమైంది. ‘అన్ స్టాపబుల్ 2’ లో మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు గెస్ట్ గా రావడంతో రాజకీయ నాయకులే వస్తారని అనుకున్నారు. కానీ అలాంటి సిస్టం ఏమి ఉండదని.. ప్రముఖులు ఎవరినైనా పిలిచే అవకాశం ఉందని షో నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ సీనియర్ నటి.. మరో జూనియర్ నటిని ఈ షోకు ఆహ్వానించారు. అయితే బాలయ్యతో ఈ ఇద్దరు భామలు ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాం..