https://oktelugu.com/

మాజీ ప్రధాని మన్మోహన్ హెల్త్ బులిటెన్ విడుదల..

ఛాతినొప్పితో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈమేరకు ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆయనకు కార్డాయోవాక్యులర్ సెంటర్లో చికిత్స అందిస్తూ అబ్వరేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆయనకు ఛాతినొప్పి రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. కాగా మన్మోహన్ సింగ్ యూపీఎ హయాంలో రెండు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. అదేవిధంగా పీవీ నర్సింహారెడ్డి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 03:21 PM IST
    Follow us on

    ఛాతినొప్పితో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈమేరకు ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆయనకు కార్డాయోవాక్యులర్ సెంటర్లో చికిత్స అందిస్తూ అబ్వరేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆయనకు ఛాతినొప్పి రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

    కాగా మన్మోహన్ సింగ్ యూపీఎ హయాంలో రెండు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. అదేవిధంగా పీవీ నర్సింహారెడ్డి క్యాబినెట్లో సేవలందించారు. పీవీ చేపట్టిన సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆర్బీఐ గవర్నర్ గా కూడా గతంలో పనిచేశారు. ప్రధానిగా ఉన్న సమయంలో 2009 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. కాగా నిన్న రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని సన్నిహితులకు ఆయన తెలుపడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుపడటంతో దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.