Income Tax: ఇక ప్రభుత్వానికి TAX కట్టాల్సిన అవసరం లేదు… ఎలాగంటే?

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ మంచి మార్గం అని భావిస్తారు. అయితే ఒక్కో సందర్భంలో భారీ నష్టాలు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు.

Written By: Srinivas, Updated On : December 18, 2023 12:15 pm
Follow us on

Income Tax: నగదును పెద్ద మొత్తంలో మార్పిడి చేసుకోవాల్సి వస్తే ప్రభుత్వానికి TAX (పన్ను ) కట్టాల్సి వస్తుంది. పరిమితికి మించి ఆదాయం పొందుతున్నా టాక్స్ పే చేయాలి. అయితే కొన్ని విషయాల్లో..కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వం టాక్స్ కు మినహాయింపు ఇస్తుంది. చాలా మంది ఆదాయపు పన్ను మినహాయింపు గురించి అవగాహన లేకపోవడంతో అనవసరంగా పన్నులు చెల్లిస్తుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టెవాళ్ళు ఎక్కువగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సి‌న అవసరం లేదు. ఎప్పుడంటే?

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ మంచి మార్గం అని భావిస్తారు. అయితే ఒక్కో సందర్భంలో భారీ నష్టాలు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సమయం, సందర్భాన్ని భట్టి స్టాక్స్‌ను అమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో పన్ను మినహాయింపు ఉంటుంది.ఎన్ని పెట్టుబడులు అమ్ముకున్నా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు.

కొంతకాలంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటికి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని విక్రయించి ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నారనుకుంటే…స్టాక్స్ విక్రయించిన ఏడాదిలోపు ఎలాంటి ఆదాయపు పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే పెట్టుబడులు విక్రయించిన మూడు సంవత్సరాల లోపు ఇల్లు కట్టుకున్నా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ రెండు విషయాల్లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

1954 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్94 ప్రకారం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందిన వారు.. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా..లేదా కట్టుకోవాలని భావించినా.. పన్ను చెల్లించాల్సి న అవసరం లేదు.అయితే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఏడాది లోపు.. కట్టుకోవాలి అని నిర్ణయించుకుంటే 3 సంవత్సరాల లొపు పూర్తి చేయాలి. గడువు దాటితే మాత్రం ఈ అవకాశాన్ని కోల్పోతారు.