Former Japanese Prime Minister Shinzo Abe: అగ్రరాజ్యం అమెరికాలో మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు గన్ లు అమ్ముతుంటారు. అక్కడ సెక్యూరిటీ కోసం 18 ఏళ్లు దాటిన వారు తుపాకులు కొనవచ్చు. తిక్కలేస్తే ఎవరినైనా కాల్చి పారేయవచ్చు. అందుకే అమెరికాలో గడిచిన నెలరోజులుగా పిచ్చెక్కిన కొందరి కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి.
ఇక అమెరికాలో ఇలా గన్ కల్చర్ ఉంటే.. ప్రశాంతతకు మారుపేరైన జపాన్ దేశంలో అసలు తుపాకులపై నిషేధం. అక్కడ తుపాకులు అమ్మడం, కొనడం నేరం. అధికారిక తుపాకులు కేవలం పోలీసుల వద్దనే. అలాంటి ప్రశాంత దేశంలోనే ఒక మాజీ ప్రధానిపై నడిరోడ్డుపై నాటుతుపాకీతో కాల్చి చంపేశారు. జపాన్ ను 20 ఏళ్ల పాటు పాలించిన మాజీ ప్రధాని షింజే అబేను పట్టపగలు ఒక దుండగుడు తుపాకీతో కాల్చాడు. ఆయన ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు.
Also Read: YS Vijayamma Resigned: విజయమ్మ రాజీనామాతో వైసీపీకి నష్టమేనా?
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరు ఆశ్చర్యపోయారు. ఆయనకు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. అక్కడున్న వారు మాత్రం తుపాకీ శబ్ధం వినిపించిందని తెలపడం సంచలనం కలిగించింది. శుక్రవారం నరా నగరంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆయన విచ్చేశారు. కానీ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అందరు హతాశులయ్యారు. షింజోకు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు.
షింజోపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. అతడిని పోలీసులు పట్టుకున్నారు. కాల్పులకు తెగబడినట్లు ఒకరిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. కానీ షింజో ఆరోగ్య పరిస్థితి విషమించి అంతర్గత రక్తస్రావమై చనిపోయారు.
తమ ప్రియతమ నేత ప్రాణాలతో ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ మేరకు పూజలు సైతం చేస్తున్నట్లు సమాచారం. దీంతో జపాన్ లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు.
అబె ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్ గుండెలోకి చొచ్చుకు వెళ్లడంతోనే షింజో అబె మరణించినట్లు వైద్యులు తెలిపారు. నాలుగున్నర గంటల పాటు వైద్యం అందించినా షింజో అబేను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Also Read:Pawan Kalyan- Jagan Navaratnalu: జగన్ నవరత్నాలపై పవన్ కళ్యాణ్ ‘నవసందేహాలు’.. వైరల్