Jabardasth Naresh: జబర్దస్త్ షో ఎంతటి ప్రాచుర్యాన్ని పొందిందో తెలిసిందే. అందులో వచ్చే కామెడీకి ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. దీంతో కామెడీ పండించే షో కావడంతో జబర్దస్త్ కు డిమాండ్ పెరిగింది. గురు, శుక్ర వారాల్లో వచ్చే జబర్దస్త్ షో కోసం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల కాలంలో కామెడీ తగ్గిందని వాదన వస్తున్నా షో ప్రభావం మాత్రం తగ్గడం లేదు. దీంతో జబర్దస్త్ షో రోజురోజుకు ఇంకా దూసుకుపోతూనే ఉంది. జబర్దస్త్ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారికి ఇష్టమైన షో గా మారింది.
జబర్దస్త్ లో కమెడియన్ గా రాణిస్తున్న నరేష్ గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తోంది. చలాకీ చంటి టీంలో ప్రస్థానం ప్రారంభించిన నరేష్ తరువాత బుల్లెట్ భాస్కర్ తో కలిసి తన సత్తా చాటుతున్నాడు. దీంతో నరేష్ వ్యక్తిగత విషయాలు తెలిస్తే బాధ కలుగుతుంది. ఓ ఇంటర్వ్యూలో నరేష్ స్వయంగా తన విషయాలు వెల్లడించాడు. తన ఎదుగుదలకు శారీరక లోపమే కారణమని చెబుతున్నాడు. కానీ అదే అడ్వాంటేజీతోనే జబర్దస్త్ లో చాన్స్ వచ్చినట్లు చెప్పడం గమనార్హం.
ఇప్పటికి నరేష్ వయసు ఇరవై ఏళ్లు. అతడి స్వస్థలం వరంగల్ జిల్లా జనగామ మండలం అనంతపురం గ్రామం. జబర్దస్త్ లోకి వచ్చిన తరువాత సొంతూళ్లో ఓ ఇల్లు, హైదరాబాద్ లో కూడా మరో ఇల్లు కట్టుకున్నాడు. జబర్దస్త్ లో తనదైన పంచులతో అందరిని నవ్వించే నరేష్ గురించి తెలియడంతో అందరు షాక్ కు గురయ్యారు. తన ఎదుగుదలకు తన ఆరోగ్యమే కారణం కావడంతో నరేష్ చాలాసార్లు బాధపడిన సంఘటనలు సైతం ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం జబర్దస్త్ లో తన టాలెంట్ తో దూసుకుపోతున్నాడు.
స్కిట్లను అందరు ప్రాక్టీసు చేసుకుంటూ నటిస్తే నరేష్ మాత్రం ఎలాంటి ప్రాక్టీసు లేకుండా డైరెక్టుగానే పాల్గొంటాడు. దీంతో అందరు రిహార్సల్స్ చేసినా నరేష్ మాత్రం ఎక్కడా తడబడకుండా డైలాగులు చెబుతాడట. దీంతో అతడిని అందరు కూడా తమ స్కిట్లలో ఉంచుకునేందుకే ఇష్టపడతారని తెలుస్తోంది. మొత్తానికి ఇలా జబర్దస్త్ షో లో నరేష్ తన హవా కొనసాగిస్తున్నాడు. నరేష్ ఎదగాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని దానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ చివరకు ఆ లోపమే అతడి ఎదుగుదలకు కారణమైందని చెబుతున్నాడు.
Also Read:Prudhvi Raj: పవన్ విషయంలో పృథ్వీ రాజ్ పశ్చాతాపం.. మరి ఆ వైభవం వస్తోందా ?