NTR – Kalyan Ram Combination: ప్రస్తుతం టాలీవుడ్ లో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న హీరో జూనియర్ ఎన్టీఆర్..స్టార్ హీరోలు ఒక హిట్టు కొట్టడానికి గగనమైపోతున్న ఈ రోజుల్లో ఎన్టీఆర్ ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా 6 హిట్లు కొట్టి తన సత్తా చాటుకున్నాడు..ఇలాంటి రేర్ ఫీట్ టాలీవుడ్ లో ఇటీవల కాలం లో ఏ హీరో కూడా చెయ్యలేదు..కెరీర్ ప్రారంభం లో పవన్ కళ్యాణ్ కి ఇలా అప్పట్లో వరుసగా 6 హిట్లు పడ్డాయి..ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉంది..లేటెస్ట్ గా విడుదలైన #RRR సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టడమే కాదు,నటుడిగా ఎన్టీఆర్ నయా విశ్వరూపాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసించేలా చేసింది..ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక సినిమా , మరియు KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా చెయ్యడానికి అంగీకరించాడు..ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ గతం లో ఒక క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమా మిస్ అయ్యాడు అని ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

Also Read: Upasana About Childrens: మేము పిల్లల్ని కనలేకపోడానికి కారణం అతనే
ఇక అసలు విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు వంశి పైడిపల్లి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టైలిష్ అల్లు అర్జున్ ని పెట్టి ఎవడు అనే సినిమాని తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..2014 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది..అయితే ఈ సినిమాని తొలుత ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తీద్దాం అనుకున్నాడట వంశి పైడిపల్లి..ఈ స్టోరీ ని ఆయన ఎన్టీఆర్ కి బృందావనం సినిమా షూటింగ్ టైం లోనే చెప్పాడు..కానీ ఎందుకో ఎన్టీఆర్ ఈ సినిమాని ఒప్పుకోలేదు..కళ్యాణ్ రామ్ పాత్ర చాలా చిన్నదిగా ఉందని..మా ఇద్దరికీ సరిపడా ఫుల్ లెంగ్త్ ముల్టీస్టార్ర్ర్ కథని సిద్ధం చేసుకొని వస్తే కచ్చితంగా కలిసి చేద్దాం అని చెప్పాడట..అలా ఈ క్రేజీ ముల్టీస్టార్ర్ర్ మిస్ అయ్యింది..అయితే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసారా అని సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుందట..అన్ని కలిసి వస్తే ఈ ఫ్రాంచైజ్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడు అని కళ్యాణ్ రామ్ ఇటీవలే బింభిసారా లాంచ్ ఈవెంట్ లో తెలిపాడు..అంటే అప్పట్లో మిస్సైన ఈ క్రేజీ కాంబినేషన్ అతి త్వరలోనే మన ముందుకి రాబోతుంది అన్నమాట.

Also Read: NTR- Samantha: ఎన్టీఆర్ తో సమంత రొమాన్స్.. మధ్యలో సాయిపల్లవి కూడా ?
[…] […]
[…] […]