https://oktelugu.com/

PM Modi: మోదీ ప్రమాణ స్వీకారానికి దేశాధినేతలు..

ఢిల్లీకి వచ్చే అతిరథుల కోసం తాజ్, లీలలా, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్‌ వంటి హోటళ్లలో ఏర్పాటు చేశారు. మరోవైపు వారి భద్రత కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 9, 2024 / 10:07 AM IST

    PM Modi

    Follow us on

    PM Modi: భారత దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్రమోదీ ఆదివారం(జూన్‌ 9న) ప్రమాణం చేయబోతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ ప్రమాణ స్వీకారోత్సవం వేళ.. రాజధాని ఢిల్లీలో సందడి వాతావరణం నెలకొంది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పొరుగు దేశాల అధినేతలకు కూడా ఆహ్వానం పంపాయి. నేపథ్యంలో సార్క్‌ దేశాల హాజరు కానున్నారు. వారికి స్వాగతం పలికేందుకు ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

    ప్రమాణానికి వచ్చేది వీరే..
    మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బంగాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్‌ మహమ్మద్‌ ముయిజ్జు, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ ఆఫీస్, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగ్నాథ్, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే ఢిల్లీకి రానున్నారు.

    పటిష్ట భద్రత..
    ఢిల్లీకి వచ్చే అతిరథుల కోసం తాజ్, లీలలా, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్‌ వంటి హోటళ్లలో ఏర్పాటు చేశారు. మరోవైపు వారి భద్రత కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీసులతోపాటు పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ, ఎస్‌డబ్ల్యూఏటీ కమాండలోను సైతం రాష్ట్రపతి భవన్‌తోపాటు పలు కీలక ప్రదేశాల చుట్టూ మోహరించారు.

    ప్రత్యేక ఆకర్షణగా ముయిజ్జు..
    మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తున్న ప్రపంచ నేతల్లో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత నవంబర్‌లో ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక ఒకవైపు భారత్‌తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చైనాతో సత్సంబంధాలు నెరిపేందుకు యత్నించారు. ఈ క్రమంలో భారత్‌తో సంబంధాలు క్షిణించాయి. భారత్‌ను విమర్శించడంతోపాటు బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముయిజ్జు మోదీ ప్రమాణ స్వీకార ఆహ్వారం అందడం, ఆయన రావడం గమనార్హం. తన పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సానుకూలంగా సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు ముయిజ్జు తెలిపారు.