Pawan Kalyan: రాష్ట్ర మంత్రిగా నాగబాబు.. పవన్ ప్లాన్ అదేనట

నాగబాబు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మాత్రం అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

Written By: Dharma, Updated On : June 9, 2024 9:34 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ క్యాబినెట్లో చేరారా? ఓటమి ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటి?జనసేనలో ఎవరు మంత్రులు అవుతారు? ఇప్పుడు ఇదే బలమైన చర్చగా ఉంది. అయితే పవన్ క్యాబినెట్లో చేరే ఛాన్స్ లేదన్న మాట వినిపిస్తోంది. పవన్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. అటు సినిమా షూటింగ్ లు, ఇటు మంత్రి పదవి.. రెండింటిని బ్యాలెన్స్ చేయలేరని.. అందుకే మంత్రి పదవిని తీసుకోరని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు క్యాబినెట్లో చేరతారని టాక్ నడుస్తోంది. అందుకే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినా తీసుకోలేదని తెలుస్తోంది.

నాగబాబు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మాత్రం అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించారు. సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. అయితే అప్పట్లో నాగబాబుకు పెద్ద ఆఫర్ చేసి తప్పించారని తెలుస్తోంది. ఎన్నికల్లో కూటమి తరుపున నాగబాబు ప్రచారం చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ సమన్వయంలో నాగబాబుది కీలకపాత్ర. అందుకే ఆయనకు మంచి పదవి ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.

వైసిపి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నాగబాబును నియమిస్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో నాగబాబు సున్నితంగా తిరస్కరించారు అని కూడా టాక్ నడిచింది. అయితే ఇదంతా మంత్రి పదవి కోసమేనని తెలుస్తోంది. పవన్ బదులు నాగబాబు క్యాబినెట్లో చేరతారని.. ఎమ్మెల్సీగా నామినేట్ చేసి.. నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం సమన్వయం విషయంలోపవన్ కీలక పాత్ర పోషిస్తారని.. సినిమాలు చేస్తూనే.. చంద్రబాబుతో కలిసి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తానికైతే తన ప్రతినిధిగా సోదరుడు నాగబాబును ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు పవన్. అది ఎంతవరకు నిజమో తెలియాలి.